కన్నీటి కథకు కరిగిన ఎన్నారై కుటుంబం.. మోసపోయిన వైనం..

కర్ణాటక కు చెందిన ఓ స్కామర్ తన హృదయ విదారకమైన కథతో ఈ ఎన్నారై కుటుంబాన్ని మోసం చేశాడు.

Update: 2024-10-04 16:30 GMT

టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది ఆన్లైన్లో జరుగుతున్న మోసాల సంఖ్య కూడా భారీగా పెరుగుతుంది. గత కొద్దికాలంలో ఎంతోమంది ఎన్నారైలు ఆన్లైన్ స్కామ్ కి బలైపోయారు. ఈ నేపథ్యంలో తాజాగా మరొక ఎన్ఆర్ఐ కుటుంబం ఆన్లైన్ మోసానికి బలైపోయింది. స్కామర్ మాయలో పడిన ఈ కుటుంబం ఏకంగా 1,60,000 రూపాయలు పోగొట్టుకున్నట్టు సమాచారం.

కర్ణాటక కు చెందిన ఓ స్కామర్ తన హృదయ విదారకమైన కథతో ఈ ఎన్నారై కుటుంబాన్ని మోసం చేశాడు. ఇండియాలో ఉన్న తన కుటుంబానికి అత్యవసరంగా డబ్బు పంపాలి అంటూ అతను సహాయం కోరాడు. తన భార్య వద్ద నుంచి వచ్చిన వాయిస్ నోట్స్ వినిపించడంతోపాటు వారి ఖాతాలో నగదు జమ చేసినట్టుగా ఓ నకిలీ బ్యాంకు రసీదును కూడా చూపించాడు.

అతను చెప్పిన మాటలు నమ్మి.. ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదుకోవాలి అనే ఉద్దేశంతో వారి స్నేహితుల అకౌంట్ నుంచి అడిగిన మొత్తాన్ని ఇండియాలోని అకౌంట్స్ కి బదిలీ చేశారు. అయితే డబ్బు ఖాతాల్లోకి చేరిన వెంటనే స్కామర్ అన్ని కమ్యూనికేషన్ మార్గాలలో ఈ ఫ్యామిలీని బ్లాక్ చేశాడు. దీంతో మోసపోయాం అని తెలుసుకున్న కుటుంబం ఇప్పటికే రెండు సైబర్ క్రైమ్ ఫిర్యాదులను దాఖలు చేసింది.

దర్యాప్తులో స్కామర్ ఉపయోగించిన బ్యాంక్ అకౌంట్ కర్ణాటకలోని యూనియన్ బ్యాంక్ కు సంబంధించిందిగా తెలిసింది. అయితే మరిన్ని వివరాల కోసం ఇంకా దర్యాప్తు జరగాల్సి ఉంది. అనవసరంగా మంచి చేయడానికి ప్రయత్నించే మోసపోయామంటూ ఎన్ఆర్ఐ కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తుంది.అంతేకాదు తమలాగా ఇంకెవరు మోసపోకూడదని.. స్కామర్స్ తో జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తోంది.

సాధారణంగా ఇటువంటి స్కామ్స్ ఎంత త్వరగా జరుగుతాయో పట్టుకోవడానికి అంత ఆలస్యం అవుతుంది. ఎందుకంటే స్కామర్ ముందుగానే అన్ని ఆలోచించుకొని తన టార్గెట్ ని ఎంచుకుంటాడు. వీళ్లకు మోసపోయాం అని తెలిసి పోలీసులను అప్రోచ్ అయ్యేలోపు స్కామర్ చాలా వరకు ఆనవాళ్లను మాయం చేస్తాడు. ఎవరైనా మిమ్మల్ని సహాయం కోసం అప్రోచ్ అయితే పూర్తి వివరాలు తెలుసుకోకుండా వారికి మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వడం.. లేదా భారీ మొత్తంలో నగదును ట్రాన్స్ఫర్ చేయడం వంటివి అస్సలు చేయకండి.

Tags:    

Similar News