భారతీయ సంతతి వ్యక్తికి యాపిల్ లో కీలక బాధ్యతలు... ఎవరీ పరేఖ్?

భారతదేశానికి చెందిన వ్యక్తులు ప్రపంచంలోని టాప్ 10 కంపెనీలలో ఉన్నత స్థానాల్లో ఉంటున్న సంగతి తెలిసిందే.

Update: 2024-08-27 06:44 GMT

భారతదేశానికి చెందిన వ్యక్తులు ప్రపంచంలోని టాప్ 10 కంపెనీలలో ఉన్నత స్థానాల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా భారతీయ సంతతికి చెందిన ఇంజినీర్ కెవాన్ పరేఖ్ ను కొత్త చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీ.ఎఫ్.ఓ) గా నియమించినట్లు యాపిల్ ప్రకటించింది.

అవును... భారతీయ సంతతికి చెందిన కెవాన్ పరేఖ్ ను తన కొత్త చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా నియమించినట్లు యాపిల్ ప్రకటించింది. ఈ మేరకు యాపిల్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ అనాలసిస్ వైస్ ప్రెసిడెంట్ కెవన్ ఫరేఖ్... వచ్చే ఏడాది జనవరి 1 నుంచి యాపిల్ సీ.ఎఫ్.ఓ. గా బాధ్యతలు స్వీకరించనున్నారని అంటున్నారు.

వాస్తవానికి కెవాన్ పరేఖ్ 11 సంవత్సరాలుగా యాపిల్ లో ఉన్నారు. కంపెనీ ఆర్థిక వ్యూహాలు, కార్యకలాపాల్లో ఆయన కీలక పాత్ర పోషించినట్లు చెబుతున్నారు. ఇలా యాపిల్ ఫైనాన్స్ టీమ్ లో టాప్ ప్లేస్ లో ఉన్న పరేఖ్.. బలమైన టెక్నికల్, బిజినెస్ విద్యలో ఎక్స్ పర్ట్ అని అంటున్నారు.

ఈ మేరకు పరేఖ్... మిచిగాన్ యూనివర్శిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ పట్టా పొందగా.. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక బిజినెస్ స్కూల్స్ లో ఒకటైన చికాగో యూనివర్శిటీ నుంచి ఎంబీయే పట్టా పొందారు. ఈ 52 ఏళ్ల ఎగ్జిక్యూటివ్ 11 సంవత్సరాల క్రితం యాపిల్ లో చేరారు.

బ్లూమ్ బెర్గ్ నివేదిక ప్రకారం... గత కొన్ని నెలలుగా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పాత్ర కోసం కేవన్ పరేఖ్ ను అతని సీనియర్ లూకా మేస్త్రీ తీర్చిదిద్దుతున్నారని అంటున్నారు. ఇక.. యాపిల్ లో చేరడానికి ముందు.. థామ్సన్ రాయిటర్స్ మరియూ జనరల్ మోటార్స్ లో కీలక స్థానాల్లో పనిచేశారు.

ఇందులో భాగంగా... రాయిటర్స్ లో నాలుగు సంవత్సరాలు ఎగ్జిక్యూటివ్ గా, కార్పొరేట్ ట్రెజరర్ గా పనిచేసిన ఆయన... జనరల్ మోటార్స్ న్యూయర్ కార్యాలయంలో బిజినెస్ డెవలప్మెంట్ డైరెక్టర్ గా, యూరప్ లోని జ్యూరిచ్ లో రీజనల్ ట్రెజరర్ గా కూడా పనిచేశారు. ఈ నేపథ్యంలో త్వరలో యాపిల్ సీ.ఎఫ్.ఓ గా బాధ్యతలు స్వీకరించనున్నారు.

Tags:    

Similar News