మిస్, మిస్సెస్, టీన్ “ఇండియా - యూ.ఎస్.ఏ. 2024” కిరీటాలు వీరి సొంతం!
న్యూజెర్సీలో జరిగిన వార్షిక పోటీల్లో చెన్నైలో జన్మించిన ఇండియన్ అమెరికన్ టీనేజర్ కైట్లిన్ సాండ్రా నీల్ (19) "మిస్ ఇండియా యూ.ఎస్.ఏ. - 2024" కిరీటాన్ని గెలుచుకున్నారు.
ఇండియా ఫెస్టివల్ కమిటీ (ఐ.ఎఫ్.సీ) నిర్వహించిన పోటీల్లో చెన్నైలో జన్మించిన అమ్మాయి సత్తా చాటింది. న్యూజెర్సీలో జరిగిన వార్షిక పోటీల్లో చెన్నైలో జన్మించిన భారతీయ – అమెరికన్ టీనేజర్ కైట్లిన్ సాండ్రా నీల్ "మిస్ ఇండియా-అమెరికా-2024" కిరిటాన్ని గెలుచుకున్నారు. ఇదే సమయంలో 'మిస్ టీన్ ఇండియా-అమెరికన్', 'మిసెస్ ఇండియా-అమెరికన్' విజేతలనూ ప్రకటించారు.
అవును... న్యూజెర్సీలో జరిగిన వార్షిక పోటీల్లో చెన్నైలో జన్మించిన ఇండియన్ అమెరికన్ టీనేజర్ కైట్లిన్ సాండ్రా నీల్ (19) "మిస్ ఇండియా యూ.ఎస్.ఏ. - 2024" కిరీటాన్ని గెలుచుకున్నారు. డెవిస్ లోని కాలిఫోర్నియా యూనివర్శిటీలో సెకండ్ ఇయర్ చదువుతున్న కైట్లిన్ ఈ కిరీటాన్ని సొంతం చేసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా స్పందించిన కైట్లిన్... తాను తన కమ్యునిటీపై సానుకూల శాస్వత ప్రభావాన్ని చూపాలని అనుకుంటున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో... మహిళ అసాధికారత, అక్షరాస్యతపై దృష్టి పెట్టాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు. ఇదే సమయంలో వెబ్ డిజైనర్ గా కావాలనుకుంటోన్నారు కైట్లిన్.
ఇలా తనకు ఇష్టమైన వెబ్ డిజైనర్ వృత్తిని చేపట్టాలని భావిస్తున్న కైట్లిన్.. మోడలింగ్, యాక్టింగ్ నూ కొనసాగించాలనుకుంటున్నట్లు తెలిపారు. చెన్నైలో జన్మించిన కైట్లిన్... గత 14 సంవత్సరాలుగా అమెరికాలోనే నివసిస్తున్నారు.
ఇదే సమయంలో ఇల్లినాయిస్ కు చెందిన సంస్కృతి శర్మ "మిసెస్ ఇండియా-యూ.ఎస్.ఏ" కిరీటాన్ని దక్కించుకోగా.. వాషింగ్టన్ కు చెందిన అర్షితా కథ్ పాలియా "మిస్ టీన్ ఇండియా - యూ.ఎస్.ఏ." టైటిల్ ను గెలుచుకున్నారు. ఈ క్రమంలో... మిస్ ఇండియా విభాగంలో నిరాలీ దేశియా మొదటి రన్నరప్ గా.. మణిని పటేల్ రెండో రన్నరప్ గా నిలిచారు.
ఈ సమయంలో... 'మిస్ ఇండియా - యూ.ఎస్.ఏ. - 2023' రిజుల్ మైని.. 'మిసెస్ ఇండియా - యూ.ఎస్.ఏ - 2023' స్నేహ నంబియార్ లు.. కైట్లిన్, సంస్కృతిలకు కిరీటాన్ని అందించారు.