కెనడాలో భారతీయ వలసదారుడి కిరాణా స్కామ్.. వీడియో వైరల్!

ఉన్నతంగా జీవించాలనో, మరో కారణంతో విదేశాలకు వెళ్లిన వారిలో కొంతమంది చిల్లరగా ప్రవర్తిస్తూ చెడ్డ పేరు తెస్తుంటారు

Update: 2024-10-01 09:30 GMT

ఏ దేశమేగినా ఎందుకాలిడినా.. ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా.. పొగడరా నీతల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము.. అనే విషయాన్ని చాలా మంది మరిచిపోతుంటారని అంటుంటారు. ఉన్నతంగా జీవించాలనో, మరో కారణంతో విదేశాలకు వెళ్లిన వారిలో కొంతమంది చిల్లరగా ప్రవర్తిస్తూ చెడ్డ పేరు తెస్తుంటారు!

తాజాగా కెనడాలోని ఓ వలసదారుడు స్థానిక కిరాణా దుకాణాలన్ను ఎలా స్కామ్ చేయాలో చెబుతూ ఏకంగా ఓ వీడియోను షూట్ చేశాడు. ఆ వీడియోను నెట్టింట పోస్ట్ చేశాడు! దీంతో.. ఈ వీడియో వైరల్ గా మారింది. దీనిపై ఒక్క రేంజ్ లో విరుచుకుపడుతున్నారు నెటిజన్లు. ఈ వీడియోపై స్పందిస్తున్న వారు.. ఇతన్ని బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.

అవును... కెనడాలోని ఓ భారతీయ వలసదారుడు స్థానిక కిరాణా దుకాణాలను ఎలా స్కామ్ చేయాలో తన ఫాలోవర్స్ కి బోధించే ఓ ఇన్ స్టాగ్రామ్ వీడియోను పోస్ట్ చేశాడు. ఈ వీడియో ఒక్కసారిగా దావాణంలా వ్యాపించిందని అంటున్నారు. ఈ వీడియోలో.. తన తోటి వలసదారులకు కోపం తెప్పించే వ్యవస్థను ఎలా స్కామ్ చేయవచ్చో చెప్పాడు!

ఈ సందర్భంగా పోస్ట్ చేసిన వీడియోపై స్పందించిన వారు... "కెనడియన్ కొత్త వ్యక్తి తన ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ కోసం కెనడా కిరాణా దుకాణాలను ఎలా స్కామ్ చేయాలో చూపించే వీడియోను రికార్డ్ చేశాడు.. ఇలాంటి వ్యక్తులు మన దేశానికి సున్నా విలువను జోడించి, మంచి వలసదారులను చెడ్డగా చూపుతారు" అని రాసుకొచ్చారు.

కష్టపడి పనిచేస్తూ నిజాయతీగా ఉండే కొత్త వారికి.. ఈ కొత్త కమ్యునిటీకి సరిపోయేలా తమ వంతు ప్రయత్నం చేస్తున్న వారికీ.. ఈ వీడియో వారి ప్రయాణంలో ఎదురుదెబ్బగా అనిపిస్తుందని అంటున్నారు.

Tags:    

Similar News