కెనడాలో భారతీయ సమాజం బలం ఎంతో తెలుసా?
ప్రస్తుతం కెనడా - భారత్ మధ్య దౌత్యపరమైన బంధం గతంలో ఎన్నాడూ లేనంత పతనస్థితికి చేరిందనే సంగతి తెలిసిందే!
ప్రస్తుతం కెనడా - భారత్ మధ్య దౌత్యపరమైన బంధం గతంలో ఎన్నాడూ లేనంత పతనస్థితికి చేరిందనే సంగతి తెలిసిందే! దీనికంతటికీ కారణం ఆ దేశ ప్రధాని ట్రూడో అనుసరిస్తున్న ఓటు బ్యాంక్ రాజకీయ వైఖరే అని భారత్ విమర్శిస్తోంది. ఈ సమయలో... కెనడాలో భారత సమాజం బలంపై చర్చలు మొదలయ్యాయి.
అవును... వైశాల్యం పరంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశం అయిన కెనడాకు... ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ కు మధ్య దౌత్య యుద్ధం జరుగుతోంది. దీనికి ప్రధాన కారణం... ఖలిస్తానీ మద్దతుదారు నిజ్జర్ హత్య విషయంలో భారత దౌత్యవేత్తలపై ట్రూడో చేసిన ఆధారాలు లేని ఆరోపణలే.
ఇక "కెనడాలో భారతీయం" విషయానికొస్తే... అక్కడ భారతీయులది ఓ బలమైన సమాజంగా ఉంది. 1980లో భారత్ లో పుట్టి కెనడా వెళ్లినవారి సంఖ్య 63,535 గా ఉండగా.. 1991-2000 మధ్య వారి సంఖ్య 1.45 లక్షలకు చేరింది. ఇదే క్రమంలో... 2006-21 మధ్య 2.46 లక్షలుగా పెరిగింది.
ఇక విద్యార్థుల విషయానికొస్తే... 2019లో కెనడాలోని భారతీయ విద్యార్థుల సంఖ్య 2.18 లక్షలుగా ఉండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 4.27 లక్షలకు చేరింది. ఇదే క్రమంలో... కెనడాలో పౌరులుగా మారుతున్న భారతీయుల సంఖ్య ఏటా భారీగా పెరుగుతోందని.. 2017లో 44.3% ఉన్న ఈ సంఖ్య 2021కి వచ్చేసరికి 61.1% మారిందని గణాంకాలు చెబుతున్నాయి.
ఇలా ప్రస్తుతం కెనడాలో ఉన్న భారతీయులు (ప్రవాసులు, భారత సంతతివారు) మొత్తం కలిపి 28 లక్షల వరకూ ఉన్నారు. ఇందులో 18 లక్షల వరకూ భారత సంతతివారు కాగా.. 10 లక్షల మందివరకూ ప్రవాసులు ఉన్నారని అంటున్నారు. దీంతో... ప్రపంచంలో భారతీయులు అధికంగా ఉన్న నాలుగో దేశంగా కెనాడా ఉంది.
ఇక వీరిలో సుమారు 8.30 లక్షల మంది హిందువులు ఉండగా.. 7.70 లఖల సిక్కులు ఉన్నరు. వీరంతా ప్రధానంగా వాంకోవర్, టొరంటో, విన్ని పెగ్, మాంట్రియల్, ఒట్టావా ప్రాంతాల్లో అధికంగా నివశిస్తున్నారు. ఈ విధంగా కెనడాలో భారతీయ సమాజం అత్యంత బలంగా ఉంది!