ఆ రెండు రాష్ట్రాల్లో భారతీయ అమెరికన్ల భిన్నాభిప్రాయాలు.. ఎవరికి ప్లస్?
అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ నెల 5న జరగనున్న సంగతి తెలిసిందే.
అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ నెల 5న జరగనున్న సంగతి తెలిసిందే. వీటికోసం గెలుపే లక్ష్యంగా డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ అభ్యర్థి - మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ లు అవిరామంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ సమయంలో.. భారతీయ అమెరికన్ ఓటర్లు ఈ ఎన్నికల్లో ప్రధానంగా రెండు రాష్ట్రాల్లో ఎలాంటి ప్రభావాన్ని చూపబోతున్నారనేది ఆసక్తిగా మారింది.
అవును... అమెరికా అధ్యక్ష ఎనికల్లో భారతీయ అమెరికన్ ఓటర్లు కీలక భూమిక పోషించబోతున్నారని.. ప్రధానంగా జార్జియా, పెన్సిల్వేనియా వంటి స్వింగ్ స్టేట్స్ లో గణనీయమైన దృష్టిని ఆకర్షిస్తున్నారని అంటున్నారు. ఇక్కడ రాజకీయాల్లో వీరి పాత్ర శక్తివంతమైనదని చెబుతున్నారు. దీంతో... ఈ రెండు రాష్ట్రాల్లోనూ వీరి మనసులో మాట ఎలా ఉందనే చర్చ తెరపైకి వచ్చింది.
అమెరికాలో సుమారు 5.3 మిలియన్ల మంది భారతీయ అమెరికన్లు ఉండగా.. వీరిలో సుమారు 2.3 మిలియన్ల మంది ఓటు వేయడానికి అర్హత కలిగి ఉన్నారు. వీరిలో మెజారిటీ ఓటర్లు భారతీయ వారసత్వం కలిగి ఉన్న కమలా హారిస్ వైపు చూస్తున్నారని, ఆమెకు మద్దతు పలుకుతున్నారని.. ఆమెవైపు నిలబడుతున్నారని అంటున్నారు.
దీనికి కేవలం ఆమె భారతీయ వారసత్వం కలిగి ఉన్న మహిళ అనే ఆలోచన మత్రమే కాదని.. ఇది అహంకారం అసలే కాదని.. కమలా హారిస్ తమ సమస్యలను నిజంగా అర్ధం చేసుకున్నారనే విషయం అక్కడి భారతీయులు భావిస్తున్నారని అంటున్నారు. ప్రధానంగా... ఆరోగ్య సమ్రక్షణ, ఇమ్మిగ్రేషన్, విద్యం వంటి విషయాల్లో ఆమె మద్దతు సంపూర్ణం అని నమ్ముతున్నారని అంటున్నారు.
ఈ క్రమంలో సుమారు 61 శాతం మంది భారతీయ అమెరికన్లు హారిస్ వైపు మొగ్గు చూపుతున్నారని ఇటీవల పలు సర్వేలు సూచించాయి. అమెరికాలో తమ విలువలు, ఆకాంక్షలకు ప్రతినిధిగా ఆమెను చూస్తున్నారని అంటున్నారు. మరోపక్క ప్రధానంగా గట్టి పోటీ ఉన్న జార్జియా, పెన్సిల్వేనియా వంటి చోట 40ఏళ్ల లోపు పురుషులు మాత్రం ట్రంప్ కు మద్దతు పలుకుతున్నారని చెబుతున్నారు.
దానికి కారణం... ఇమ్మిగ్రేషన్, ఆర్థిక వ్యవస్థ వంటి సమస్యలపై ట్రంప్ మరింత ప్రభావవంతంగా ఉంటాడని వారు నమ్ముతున్నారని అంటున్నారు. ఇలా ఈ రెండు కీలక రాష్ట్రాల్లోనూ భారతీయ అమెరికన్లు భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నారని చెబుతున్నారు.
మరి.. ఎన్నికల రోజు సమీపిస్తున్న వేళ.. ఈ రసవత్తర పోరులో కీలక భాగంగా చెబుతున్న భారతీయ అమెరికన్లు ఎలాంటి ప్రభావం చూపబోతున్నారు.. వారిలో మెజారిటీ ప్రజల ఆకాంక్షలుగా చెబుతున్నవి ఏ మేరకు నెరవేరబోతున్నాయనేది వేచి చూడాలి!