గత ఐదేళ్లలో విదేశాల్లో మరణించిన భారతీయ విద్యార్థుల వివరాలివే!

అవును... గత ఐదేళ్లలో వివిధ కారణాలతో విదేశాల్లో మరణించిన భారతీయ విద్యార్థుల వివరాలు వెలుగులోకి వచ్చాయి.

Update: 2024-07-27 04:35 GMT

ఇటీవల కాలంలో విదేశాలకు వెళ్లిన భారతీయ విద్యార్థులు రకరకాల కారణాలతో మృతిచెందుతున్నట్లు వస్తున్న వార్తలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో... హత్యలు, ఆత్మహత్యలు, అనారోగ్యం, ప్రమాదాలు.. ఇలా పలు రకాల కారణాలతో గత ఐదేళ్లలో విదేశాల్లో మరణించిన భారతీయ విద్యార్థుల వివరాలు దేశాలవారీగా తాజాగా వెలుగులోకి వచ్చాయి.

అవును... గత ఐదేళ్లలో వివిధ కారణాలతో విదేశాల్లో మరణించిన భారతీయ విద్యార్థుల వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మేరకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్థన్ సింగ్ లోక్ సభలో ఈ వివరాలు వెల్లడించారు. ఇందులో భాగంగా... గత ఐదేళ్లలో విదేశాల్లో మరణించిన భారతీయ విద్యార్థుల సంఖ్య ఆరువందల ముప్పై మూడు (633) అని తెలిపారు. ఇదే సమయంలో దేశాలవారీగా వివరాలు వెల్లడించారు.

ఇందులో భాగంగా... విదేశాల్లో మరణిస్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య కెనడాలో ఎక్కువగా ఉందని ప్రభుత్వం తెలిపింది. కెనడాలో గత ఐదేళ్లలో 172 మంది భారతీయ విద్యార్థులు మృతి చెందారు. ఇక తర్వాత స్థానంలో అమెరికా (108), యూకే (58), ఆస్ట్రేలియా (57), రష్యా (37), జర్మనీ (24), ఉక్రెయిన్ (18), జార్జియా (12), కిర్గిస్తాన్ (12), సైప్రస్ (12), చైనా (8) చొప్పున అధికంగా కేసులు నమోదయ్యాయని అన్నారు.

ఇక మొత్తం 19 మంది భారతీయ విద్యార్థులు విదేశాల్లో దాడుల కారణంగా మరణించగా.. వారిలో అత్యధికంగా కెనడాలో 9 మరణాలు, యూఎస్ లో 6 మరణాలు నమోదయ్యాయని మంత్రి తెలిపారు! ఇదే సమయంలో గత మూడేళ్లలో మొత్తం 48 మంది భారతీయ విద్యార్థులు అమెరికా నుంచి బహిస్కరించబడ్డారని కీర్తి వర్ధణ్ సింగ్ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇదే సమయంలో.. ప్రస్తుతం 13 లక్షల మంది భారతీయ విద్యార్థులు విదేశాల్లో విద్యనభ్యసిస్తున్నారని అన్నారు.

Tags:    

Similar News