కేరళలో జన్మించిన వ్యాపారవేత్తపై హెజ్బొల్లా పేజర్స్ పేలుళ్ల కేసు!!
ఇటీవల హెజ్బొల్లా పేజర్లు పేలిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
ఇటీవల హెజ్బొల్లా పేజర్లు పేలిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఒక్కసారిగా వేల సంఖ్యలో పేజర్లు బ్లాస్ట్ అవ్వడం 30 మందికి పైగా మరణించగా.. వేలమంది గాయపడ్డారు. ఈ కేసులో ఇప్పుడు భారత సంతతికి చెందిన వ్యాపారవేత్తకు నార్వే పోలీసులు వారెంట్ జారీ చేశారు.
అవును... కేరళలో జన్మించిన నార్వేజియన్ వ్యాపారవేత్త రిన్సన్ జోస్ గత వారం అమెరికా పర్యటనలో ఉండగా.. కనిపించకుండా పోయాడని అంటున్నారు. దీంతో అతడిపై నార్వే అంతర్జాతీయ సెర్చ్ వారెంట్ జారీ చేసింది. పేజర్ కేసుకు సంబంధించి తప్పిపోయిన వ్యక్తి నివేదికను సెప్టెంబర్ 25న ఓస్లో పోలీసు అందుకున్నట్లు రాయిటర్స్ పేర్కొంది.
నోర్టా గ్లోబల్ లిమిటెడ్ అనే బల్గేరియన్ కంపెనీ స్థాపకుడైన రిన్సన్ జోష్... లెబనీస్ మిలిటెంట్ గ్రూప్ హిజ్బిల్లా కు పేజర్ లు సరఫరా చేసిన చైన్ సిస్టం లో భాగమని అంటున్నారు! 2022లో స్థాపించిన ఈ కంపెనీ ద్వారానే పెజర్లను హిజ్ బొల్లాకు విక్రయించినట్లు స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఇలా పేజర్ల విక్రయానికి.. నార్వే యాజమాన్యంలోని కంపెనీకి సంబంధం ఉందన్న నివేదికలపై నార్వే భద్రతా పోలీసులు ప్రాథమిక దర్యాప్తును కూడా ప్రారంభించినట్లు చెబుతున్నారు.
కాగా... జాతీయ మీడియా కథనాల ప్రకారం వయనాడ్ లోని ఒండయంగడి గ్రామంలో టైలరింగ్ చేసుకునే దంపతులకు జన్మించిన రిన్సన్ జోస్... చివరిగా ఈ ఏడాది జనవరిలో ఇంటికి వెళ్లాడు. ఇక అతని సోదరుడు యూకే ఉంటుండగా, అతని సోదరి ఐర్లాండ్ లో నర్సుగా పనిచేస్తుంది. జోస్ తన భార్యతో కలిసి నార్వేలో నివసిస్తున్నాడు.