ఎన్ఆర్ఐ డిపాజిట్లు 43శాతం పెరిగాయి

ఇదే కాలానికి 2023లో నమోదైన డిపాజిట్ల కంటే ఇది ఎక్కువ కావడం గమనార్హం.

Update: 2025-02-21 04:43 GMT

విదేశాల్లో ఉన్న భారతీయుల నుంచి భారతదేశంలోని ప్రవాస భారతీయుల కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో (FCNR ఖాతాలు ) డబ్బు ప్రవాహం భారీగా పెరిగింది. 2024 ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్యకాలంలో 42.8 శాతం పెరిగడం విశేషం. ఇదే కాలానికి 2023లో నమోదైన డిపాజిట్ల కంటే ఇది ఎక్కువ కావడం గమనార్హం.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం, 2024 ఏప్రిల్-డిసెంబర్ మధ్య ఎన్ఆర్ఐ డిపాజిట్ల మొత్తం $13.33 బిలియన్లు ఉండగా, 2023లో ఇదే కాలంలో ఇది $9.33 బిలియన్ మాత్రమే కావడం గమనార్హం.

- డిసెంబర్ 2024 నాటికి ఎన్ఆర్ఐ డిపాజిట్ల మొత్తం $161.8 బిలియన్లుగా ఉంది. ఇది డిసెంబర్ 2023లో $146.9 బిలియన్‌ తో పోలిస్తే పెరుగుదలను చూపిస్తోంది.

ఈ పెరుగుదలలో అత్యధిక డిపాజిట్లు ఖాతాల్లో నమోదయ్యాయి. 2024 ఏప్రిల్-డిసెంబర్ మధ్య ఈ ఖాతాల్లో $6.46 బిలియన్ జమ కాగా.. 2023 ఇదే కాలంలో ఇది దాదాపు సగమే.. అంటే $3.45 బిలియన్ మాత్రమే. డిసెంబర్ 2024 నాటికి FCNR ఖాతాల్లో ఉన్న మొత్తం డిపాజిట్లు $32.19 బిలియన్‌కు పెరిగాయి.

FCNR ఖాతాలు ఎన్ఆర్ఐలకు విదేశీ కరెన్సీలో 5 సంవత్సరాల వరకు స్థిర డిపాజిట్లను నిర్వహించుకునే వెసులుబాటును కల్పిస్తాయి. దీనివల్ల మారకం విలువల మార్పుల నుంచి వారి డబ్బును రక్షించుకోవచ్చు.

ఇతర డిపాజిట్లలో NRE ఖాతాల్లోకి వచ్చిన మొత్తం డబ్బు $3.57 బిలియన్‌గా ఉంది. 2023 ఇదే కాలంలో ఇది $2.91 బిలియన్ మాత్రమే. డిసెంబర్ 2024 నాటికి NRE ఖాతాల్లో మొత్తం డిపాజిట్లు $99.56 బిలియన్‌గా ఉన్నాయి.

ఎన్.ఆర్.వో ఖాతాల్లో $3.29 బిలియన్ డిపాజిట్లు నమోదయ్యాయి. డిసెంబర్ 2024 నాటికి ఈ ఖాతాల్లో మొత్తం డిపాజిట్లు $30.04 బిలియన్‌గా ఉన్నాయి.

అంతర్జాతీయ కరెన్సీ ప్రవాహాన్ని ఆకర్షించేందుకు , రూపాయిని అమెరికన్ డాలర్‌తో పోలిస్తే బలంగా ఉంచేందుకు ఆర్బీఐ, FCNR(B) డిపాజిట్లపై వడ్డీ రేట్ల పరిమితిని పెంచింది. దీంతో విదేశాల నుంచి ఇండియాకు డబ్బు ప్రవాహం పెరిగింది.

Tags:    

Similar News