ప్రాణం తీసిన అతి వేగం... అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి!

అమెరికాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో తెలుగు విద్యార్థులు వరుసగా మృతి చెందుతుండటం తీవ్ర అందోళన కలిగిస్తుంది!

Update: 2024-12-18 06:02 GMT

అమెరికాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో తెలుగు విద్యార్థులు వరుసగా మృతి చెందుతుండటం తీవ్ర అందోళన కలిగిస్తుంది! ఈ వారంలో గుంటూరు జిల్లాకు చెందిన నాగశ్రీ వందన పరిమళ (26) మృతి చెందగా.. పవన్, నికిత్ అనే స్నేహితులు తీవ్రంగా గాయడ్డారు. ఈ సమయంలో తాజాగా మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. మరో తెలుగు విద్యార్థి మృతి చెందారు!

అవును... అమెరికాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో వరుసగా తెలుగు విద్యార్థులు బలైపోతున్న ఘటనలు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరో తెలుగు విద్య్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఇందులో భాగంగా... పంజాల నిరజ్ గౌడ్ (23) సోమవారం తెల్లవరుజామున 2:20 గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

ఆ సమయంలో నీరజ్ ప్రయాణిస్తున్న హ్యూండాయ్ ఎలంట్రా కారు అతి వేగం కారణంగా అదుపుతప్పినట్లు చెబుతున్నారు. అలా అదుపు తప్పి సిట్కో గ్యాస్ స్టేషన్ లోకి దుసుకెళ్లగా.. ఈ క్రమంలో ఆ సమయానికి అక్కడే ఉన్న పోలీసు వాహనాన్ని ఢీకొట్టిందని చెబుతున్నారు. దీంతో.. ఆ వాహనంలో ఉన్న ఓ పోలీసు అధికారికి తీవ్ర గాయాలయ్యాయని తెలుస్తోంది.

ఈ ప్రమాదంలో నీరజ్ తీవ్రంగా గాయపడగా.. అతనితో పాటు ఆ ప్రమాదంలో గాయపడిన పోలీసు అధికారిని వెంటనే ఆస్పత్రికి తరలించారని తెలుస్తోంది. ఈ సమయంలో... తీవ్రంగా గాయపడిన నీరజ్.. చికిత్స పొందుతూ మృతి చెందగా.. పోలీసులు అధికారికి చికిత్స కొనసాగుతుందని.. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని అంటున్నారు.

ఈ సందర్భంగా స్పందించిన వెస్ట్ హెవెన్ పోలీసులు... అతివేగం కారణంగా మంచుతో నిండిన రోడ్డుపై నియంత్రణ కోల్పోయాడని.. ఆ సమయంలో ఆగి ఉన్న పోలీసు క్రూయిజర్ ను ఢీకొట్టినట్లు చెబుతున్నారు. ఇక.. గాయపడిన అధికారి గురించి స్పందించిన వెస్ట్ హెవెన్ పోలీసు ప్రతినిధి సార్జంట్... అతడు తిరిగి పనిలో చేరడానికి చాలా సమయం పడుతుందని అన్నారు.

ఈ ఘటనను న్యూయార్క్ రాయబార కార్యాలయం ధృవీకరించింది. ఈ విషయాన్ని మృతుడి తల్లితండ్రులకు తెలియజేశామని.. మృతదేహాన్ని త్వరలో భారత్ కు తరలిస్తామని వెల్లడించారు. ఈ సమాచారంతో కుటుంబం, బంధువులు, స్నేహితులు శోక సంద్రంలో మునిగిపోయారని అంటున్నారు.

Tags:    

Similar News