ఉషా చిలుకూరి అసలు ఊరు అదేనా?

ఇక ఉష తండ్రి రాధాకృష్ణ ఇంజినీరింగ్ పూర్తైన తర్వాత ఎంఎస్ చేయడం కోసం అమెరికాకు వెళ్లారు. ఉష తల్లి లక్ష్మి కూడా చెన్నైలోనే మాలిక్యులర్ బయాలజీ చదువుకున్నారు.

Update: 2024-07-18 12:24 GMT

అమెరికా అధ్యక్ష ఎన్నికలపై భారతీయుల, ప్రధానంగా తెలుగు వారి ఆసక్తి మరింత పెరిగింది. అందుకు కారణం... ఉషా చిలుకూరి అనేది తెలిసిన విషయమే. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అంచనాలు నిజమైతే... ఓ తెలుగు మహిళ అగ్రరాజ్యంలో ద్వితీయ మహిళగా నిలుస్తారు. దీంతో... ఉషా చిలుకూరి అసలు ఊరుపై రకరాకల చర్చలు తెరపైకి వచ్చాయి. కానీ... వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నాయని తెలుస్తోంది.

అవును... రిపబ్లికన్ పార్టీ తరుపున అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా జేడీ వాన్స్ పేరును అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ వైఎస్ ప్రెసిడెంట్ అభ్యర్థి జేడీ వాన్స్ భార్య.. ఉషా చిలుకూరి వాన్స్. జేడీ వాన్స్ పేరును ట్రంప్.. ఉపాధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించడంతో భారత్ లో.. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఉషా చిలుకూరి పేరు మారుమోగిపోతోంది.

అయితే ఇప్పటివరకూ చెబుతున్నట్లు ఆమె కృష్ణాజిల్లా పామర్రుకు చెందిన వారు కాదు. ఆమె పూర్వీకులు పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు దగ్గరలోని వడ్డూరు ప్రాంతం. ఈ కుటుంబంలోని తొలితరం వారంతా సంస్కృత విధ్వాంసులు కాగా.. ఉష తాత రామశాస్త్రి అప్పట్లోనే చెన్నైకు షిఫ్ట్ అయిపోయారు. ఆయన మద్రాసు ఐఐటీ ప్రొఫెసర్ గా పనిచేశారు.

ఇక ఉష తండ్రి రాధాకృష్ణ ఇంజినీరింగ్ పూర్తైన తర్వాత ఎంఎస్ చేయడం కోసం అమెరికాకు వెళ్లారు. ఉష తల్లి లక్ష్మి కూడా చెన్నైలోనే మాలిక్యులర్ బయాలజీ చదువుకున్నారు. వీరిరువురి వివాహం తర్వాత అమెరికాకు వెళ్లి అక్కడే సెటిల్ అయ్యారు. ఈ నేపథ్యంలో... ఉష అమెరికాలోనే జన్మించింది.. శానిడియాగోలో పుట్టి పెరిగింది.

చెన్నైలో ఉన్న ఉష మేనత్త డాక్టర్ శారద ఈ విషయాలు వెల్లడించారు. దీంతో... ఉష పూర్వీకులు గోదావరి జిల్లాల వారనే విషయం వెలుగులోకి వచ్చింది. ఇక ఉషా కుటుంబం హిందూ సంప్రదాయాలను నిష్టగా పాటించే బ్రాహ్మణ ఫ్యామిలీ కాగా... ఉష పెళ్లి కూడా హిందూ పద్దతిలోనే జరిగింది. ఇక, జేడీ వ్యాన్స్ క్యాథలిక్ మతాన్ని అనుసరిస్తారు.

Tags:    

Similar News