భర్త ఎంత ఇంట్రస్టింగ్ పర్సనో ఓపెన్ అయిన ఉషా

గడిచిన మూడు రోజుల్లో వార్తల్లో నిలుస్తున్న ఉషా చిలుకూరి.. తాజాగా ఆమె మాటలే వార్తలుగా మారాయి

Update: 2024-07-18 13:30 GMT

గడిచిన మూడు రోజుల్లో వార్తల్లో నిలుస్తున్న ఉషా చిలుకూరి.. తాజాగా ఆమె మాటలే వార్తలుగా మారాయి. అమెరికా ఉపాధ్యక్ష పదవికి రిపబ్లికన్ అభ్యర్థిగా బరిలోకి నిలిచిన జేడీ వాన్స్ వ్యక్తిగత విషయాలు పెద్దగా తెలీవు. ఇలాంటి వేళ.. ఆయన సతీమణి.. భారత సంతతి అమెరికన్ అయిన ఉషా చిలుకూరి తన భర్త గురించి ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. తాజాగా ఆమె మిల్వాకీలో జరిగిన పార్టీ నేషనల్ కన్వెన్షన్ లో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా భర్త గురించి ఎన్నో ఆసక్తికర అంశాల్ని షేర్ చేయటమే కాదు.. తన జీవితంలో తాను ఇప్పటివరకు కలుసుకున్న వారిలో అత్యంత ఇంట్రస్టింగ్ పర్సన్ ఆయనే అంటూ తనకున్న ప్రేమ మొత్తాన్ని మాటల్లో వ్యక్తపరిచారు.

తామిద్దరం తొలిసారి ఎక్కడ కలుసుకున్న విషయాన్ని చెప్పిన ఆమె.. అప్పుడు.. ఇప్పుడు ఒకేలా ఉన్నాడని.. ఏ మాత్రం మార్పు లేదన్నారు. ‘‘మేం తొలిసారి యేల్ లా స్కూల్లో కలుసుకున్నాం. మా కలయిక అమెరికా గొప్పదనానికి నిదర్శనం. ఆయన మీట్ పొటాటోస్ లాంటి వ్యక్తే. నాలోని శాఖాహార అలవాట్లను ఫాలో అయ్యాడు. నా తల్లి నుంచి భారతీయ వంటకాల్ని నేర్చుకున్నాడు. మా కుటుంబంలో విడదీయలేని భాగమయ్యాడు’’ అని తన భర్త గురించి చెప్పుకొచ్చారు.

తామిద్దరం స్నేహితులుగా ప్రయాణాన్ని మొదలు పెట్టామన్న ఉష.. అప్పుడు ఎలా అన్నారో ఇప్పుడు కూడా జేడీ వాన్స్ అలానే ఉన్నట్లు పేర్కొన్నారు. ‘‘బాలయ్యంలో కష్టాలు దాటుకొని వచ్చిన వ్యక్తి. కష్టించే తత్త్వం ఉంది. ఇరాక్ లో పని చేసిన కఠినమైన మెరైన్. ఖాళీ సమయాల్లో కుక్కపిల్లలతో ఆడుకుంటూ.. బేబ్ సినిమాను చూస్తూ కాలక్షేపం చేస్తాడు’’ అంటూ భర్త గురించి ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు.

ఇక.. ఉషా చిలుకూరి గురించి ఆమె భర్త సైతం అంతే గొప్పగా చెప్పుకున్నారు. గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ఉష తనను వాస్తవాల్లోకి తీసుకొచ్చిందని.. తాను సాధించిన దాని కంటే ఆమె సాధించింది ఎక్కువని పేర్కొన్నారు. అంతేకాదు తన భార్య బలమైన మహిళా వాణి అని చెబుతూ.. ‘‘నా భార్య హిందూ ధర్మం కీలక సవాళ్లకు మార్గదర్శకం చేసింది. నా ప్రతి విజయం వెనుక ఆమె ఉన్నారు’’ ఉషా చిలుకూరి గురించి చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News