అల‌నాటి హీరోయిన్ మూవీ నేరుగా ఓటీటీలోకి

క‌రోనా త‌ర్వాత మ‌ళ్లీ ఆడియ‌న్స్ థియేట‌ర్ల‌కు అల‌వాటు ప‌డ్డారు. దీంతో గ‌త రెండుమూడేళ్లుగా డైరెక్ట్ గా ఓటీటీలో సినిమాలు రిలీజ‌వ‌డం త‌గ్గింది.;

Update: 2025-03-18 18:09 GMT

క‌రోనా టైమ్ లో ఎన్నో సినిమాలు నేరుగా ఓటీటీలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. చిన్న హీరోల సినిమాల నుంచి స్టార్ హీరోల సినిమాల వ‌ర‌కు ఎన్నో సినిమాలు డైరెక్ట్ ఓటీటీలో రిలీజయ్యాయి. క‌రోనా త‌ర్వాత మ‌ళ్లీ ఆడియ‌న్స్ థియేట‌ర్ల‌కు అల‌వాటు ప‌డ్డారు. దీంతో గ‌త రెండుమూడేళ్లుగా డైరెక్ట్ గా ఓటీటీలో సినిమాలు రిలీజ‌వ‌డం త‌గ్గింది.

ఇప్పుడు చాలా రోజుల త‌ర్వాత భారీ స్టార్ క్యాస్ట్ తో తెర‌కెక్కిన ఓ పెద్ద సినిమా నేరుగా ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది. అదే ది టెస్ట్. శ‌శికాంత్ డైరెక్ట‌ర్ గా ప‌రిచ‌య‌మ‌వుతున్న ఈ సినిమాలో న‌య‌న‌తార‌, మీరాజాస్మిన్, మాధ‌వ‌న్, సిద్ధార్థ్ లీడ్ రోల్స్ లో న‌టించారు. చెన్నైలో జ‌రిగిన ఓ ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ మ్యాచ్ ముగ్గురు వ్య‌క్తుల జీవితాల్ని ఎలా ప్ర‌భావితం చేసింద‌నే క‌థ‌తో ఈ మూవీ రూపొందింది.

వైనాట్ స్టూడియోస్ బ్యాన‌ర్ లో రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 4న నెట్‌ఫ్లిక్స్ లో నేరుగా రిలీజ్ కానున్న‌ట్టు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. మీరాజాస్మిన్ ఫోటోల‌ను షేర్ చేస్తూ నెట్‌ఫ్లిక్స్ ఈ విష‌యాన్ని రివీల్ చేసింది. త‌మిళంతో పాటూ తెలుగు, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో ది టెస్ట్ అందుబాటులోకి రానున్న‌ట్టు నెట్‌ఫ్లిక్స్ వెల్ల‌డించింది.

ఈ స్పోర్ట్స్ డ్రామాలో న‌య‌న్, మీరా జాస్మిన్ పాత్ర‌లు చాలా కీల‌కంగా ఉంటాయ‌ని, ఇది లేడీ ఓరియెంటెడ్ సినిమా అని చిత్ర యూనిట్ స‌భ్యులు చెప్తున్నారు. గ‌తంలో న‌య‌న్ న‌టించిన రెండు మూడు సినిమాలు ఓటీటీలో రిలీజై మంచి హిట్ అవ‌గా, ఇప్పుడు టెస్ట్ కూడా ఓటీటీలోనే రిలీజ‌వుతుండ‌టంతో ఈ మూవీ కూడా సూప‌ర్ హిట్ గా నిలుస్తుంద‌ని భావిస్తున్నారు.

ఒక‌ప్ప‌టి స్టార్ హీరోయిన్ మీరా జాస్మిన్ తెలుగువారికి చాలా సుప‌రిచితురాలే. ర‌వితేజ భ‌ద్ర మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఆమె ఆ త‌ర్వాత తెలుగులో ప‌లు సూప‌ర్ హిట్ సినిమాల్లో న‌టించింది. ప‌వ‌న్ తో గుడుంబా శ‌కంర్, రారాజు, ఆకాశ రామ‌న్న‌, గోరింటాకు, మ‌హార‌థి లాంటి సినిమాల్లో న‌టించి మెప్పించిన ఆమె కొన్నేళ్ల పాటూ మూవీస్ నుంచి బ్రేక్ తీసుకుంది. మొన్నామ‌ధ్య విమానం మూవీతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన మీరా జాస్మిన ఇప్పుడు టెస్ట్ సినిమాతో అల‌రించడానికి రెడీ అవుతుంది.

Tags:    

Similar News