కరోనా టీకా తీసుకున్న 108 డ్రైవర్ ఆకస్మిక మృతి !

Update: 2021-01-20 10:30 GMT
దేశ వ్యాప్తంగా కరోనా టీకాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని సంతోషిస్తున్న సమయంలో షాకింగ్ న్యూస్ ఒకటి వెలుగులోకి వచ్చింది. కరోనా టీకాలు సురక్షితమా, కాదా అనే అనుమానాలు ఇంకా ప్రజలకు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అత్యవసర వినయోగం నిమిత్తం భారత్‌లో కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకా లకు ఆమోదం లభించం తెలిసిందే. జనవరి 16న కరోనా టీకాలు ప్రారంభించగా.. టీకా తీసుకున్న కొందరిలో సైడ్‌ ఎఫెక్ట్స్‌ కనిపిస్తుండటం.. రెండు, మూడు చోట్ల వ్యాక్సిన్‌ తీసుకున్న వారు మృతి చెందడంతో టీకా కోసం రిజిస్టర్‌ చేసుకున్న వారు కూడా ప్రస్తుతం వెనకడుగు వేస్తున్నారు.

ఈ నేపథ్యంలో కోవిడ్‌ వ్యాక్సిన్ తీసుకున్న ఓ అంబులెన్స్‌ డ్రైవర్‌ మృతి చెందడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ ఘటన పై పూర్తి వివరాల్లోకి వెళ్తే .... నిర్మల్‌ జిల్లా, కుంటాల మండలానికి చెందిన విఠల్‌ 108 అంబులెన్స్‌ డ్రైవర్ ‌గా పని చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో భాగంగా మంగళవారం కుంటాల పీహెచ్‌సీలో విఠల్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నాడు. ఇక రాత్రి‌ తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో కుటుంబ సభ్యులు అతడిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ..ఈ రోజు తెల్లవారు జామున 5:30 నిముషాలకి విఠల్‌ మృతి చెందాడు. అయితే విఠల్‌ మృతిపై ప్రజా  డైరెక్టర్  అప్ పబ్లిక్ హెల్త్ స్పందించారు.

గుండెపోటుతో ఆయన మరణించారని ఓ ప్రకటన విడుదల చేశారు. కరోనా వ్యాక్సిన్ కు సంబందం లేదన్నారు.  మరణంపై విచారణ కోసం  కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ ఆధారంగా నివేదిక సమర్పించనున్నారు నిపుణులు. జిల్లా నిపుణుల ఇచ్చే నివేదికను ఎఈఎఫ్ ఐ కమీటీ నిపుణల బ్రుందం పరిశీలించనుంది. దీంతో వ్యాక్సినేషన్‌ కు కొందరు వెనుకడుగు వేస్తున్నారు. ఎక్కడ తాము అనారోగ్యంబారిన పడతామోనని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News