టీడీపీ కార్యాల‌యంపై దాడికి 11 నెల‌లు.. మాయ‌ని గాయం!

Update: 2022-09-17 11:17 GMT
ప్ర‌జ‌లే దేవుళ్లు.. స‌మాజ‌మే దేవాల‌యం.. అంటూ.. నిన‌దించిన టీడీపీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షులు.. ఎన్టీఆర్‌.. నిలువెత్తు విగ్ర‌హం.. ఆహ్వానిస్తున్న‌ట్టుగా ఉండే.. ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ కేంద్ర కార్యాల‌యంపై వైసీపీ నేత‌లు విజృంభించి.. సెప్టెంబ‌రు 17 నాటికి 11 నెల‌లు పూర్త‌య్యాయి. అయిన‌ప్ప‌టికీ.. ఈ గాయం ఇంకా మాన‌లేదు. టీడీపీ ప‌చ్చిపుండుగానే దీనిని భ‌రిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు అటు కేంద్రం కానీ.. ఇటు రాష్ట్ర  పోలీసులు కానీ.. దీనిపై స్పందించ‌క‌పోవ‌డం.. గ‌మ‌నార్హం.

అస‌లుఏం జ‌రిగిందంటే.. మాజీ మంత్రి అయ్య‌న్న‌పాత్రుడు ఏపీ సీఎం జ‌గ‌న్‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారం టూ.. ఆ పార్టీ అప్ప‌టి ఎమ్మెల్యే.. ప్రస్తుత మంత్రి జోగి ర‌మేష్‌.. తాడేప‌ల్లిలోనిచంద్ర‌బాబు ఇంటిపైకి దాడికి య‌త్నించిన విష‌యం తెలిసిందే.

ఇది రాష్ట్రంలో పెద్ద దుమారం రేపింది. ఇక‌, ఇది జ‌రిగిన కొన్ని నెల్ల‌లోనే.. టీడీపీ నాయ‌కుడు.. ప‌ట్టాభి.. ఓ మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ.. కొన్ని వ్యాఖ్య‌లు చేశారు. ఈ వ్యాఖ్య‌లు దుమారం రేపాయి.

ఈ క్ర‌మంలోనే వైసీపీ నాయ‌కులు.. నేరుగా.. టీడీపీ ప్ర‌ధాన కార్యాలయంపై దాడి చేసి.. రాళ్ల వ‌ర్షం కురిపించారు. ఫ‌ర్నిచ‌ర్ ధ్వంసం చేశారు. దీంతో ఈ వివాదం..రాష్ట్రం మొత్తాన్ని క‌దిలించింది. ఈ క్ర‌మంలోనే టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఒక‌రోజు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు. అదేవిధంగా.. తాను అదే కార్యాల‌యంలో.. దీక్ష కు కూర్చున్నారు. ఇక రాష్ట్రంలోటీడీపీపై జ‌రుగుతున్న దాడిని కేంద్రానికి వివ‌రించేందుకు నేరుగా ఢిల్లీకి వెళ్లారు.

రాష్ట్రంలో అప్ప‌టి డీజీపీ స‌వాంగ్‌కు సైతం.. ఫిర్యాదు చేశారు. 'వైసీపీ రౌడీలు.. గూండాల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌'ని కోరారు. అయితే.. నేటికీ.. దీనిపై పోలీసులు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోక‌పోగా.. క‌నీసం కేసు కూడా క‌ట్ట‌లేదు.

ఈ విష‌యం..ఇప్ప‌టికీ పార్టీలో మార‌ని గాయంగానే ఉంద‌ని అంటున్నారు నాయ‌కులు.. తాజాగా కొంద‌రునాయ‌కులు మ‌రోసారి దీనిపై ఫిర్యాదు చేసేందుకు సిద్ద‌మ‌య్యారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News