దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమానికి సంబంధించి ప్రధాని మోడీ తీరును వ్యతిరేకిస్తూ పోస్టర్లు అతికించారన్న ఆరోపణలతో ఢిల్లీ పోలీసులు పలు స్టేషన్లలో 17 ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు. విచారణ జరిపి 17మందిని అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పెరుగుతున్నా నియంత్రించలేకపోతున్నారన్న ఆరోపణలతో మోడీపై దుష్ప్రచారం జరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు.
ఢిల్లీలోని గోడలపై ‘పీఎం మోడీ గారు మన పిల్లల వ్యాక్సిన్లను విదేశాలకు ఎందుకు పంపారు?’ అని రాసి ఉన్న పోస్టర్లను నగరంలోని పలు ప్రాంతాల్లో అతికించారు. ఈ పోస్టర్లకు సంబంధించి పోలీసులకు తాజాగా సమాచారం అందింది. తూర్పు ఢిల్లీలోని కళ్యాణ్ పురి ఏరియాలో తాజాగా ఆరుగురిని అరెస్ట్ చేశారు. ప్రధాని మోడీని విమర్శిస్తూ ఉండగా వారిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 800 పోస్టర్లను, బ్యానర్లను స్వాధీనం చేసుకున్నారు.
సెకండ్ వేవ్ ను ఎదుర్కోవడంలో మోడీ ఫెయిల్ అయ్యాడని విమర్శలు వస్తున్నాయి. పైగా ఢిల్లీలో ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు పోతున్నాయి. పాజిటివిటీ రేటు విపరీతంగా ఉంది. ఈ క్రమంలోనే అక్కడి వారు మోడీకి వ్యతిరేకంగా పోస్టర్లు వేసినట్టు తెలుస్తోంది. పోస్టర్లలో మోడీని ప్రశ్నించిన 17మందిని పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు.
మోడీపై పోస్టర్లకు సంబంధించి ఇంకా ఫిర్యాదులు వస్తే మరిన్ని ఎఫ్ఐఆర్ లు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. ఎవరి తరుఫున ఈ పోస్టర్లు వెలిశాయన్న అంశంపై దర్యాప్తు చేస్తున్నామని.. దానికి అనుగుణంగా తదుపరి చర్యలు ఉంటాయని తెలిపారు.