హెల్త్ బులిటెన్: ఏపీలో ఒక్క రోజులో 17 కరోనా పొజిటివ్ కేసులు

Update: 2020-03-31 08:14 GMT
ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారు ఇప్పుడు కరోనా ఆటంబాబులా మారారు. ఢిల్లీలో ప్రత్యేక ప్రార్థనల కోసం తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది పోయారు. ఆ సమావేశానికి 250మందికి పైగా విదేశీయులు వచ్చారు. వారికి కరోనా బయటపడింది. ఢిల్లీ నుంచి వచ్చిన చాలా మంది క్వారంటైన్ లో ఉన్నారు. వారందరికీ కరోనా సోకడం ఖాయంగా కనిపిస్తోంది.

ఢిల్లీలో నిర్వహించి తబ్లిగి జమాత్ మత సమావేశానికి చాలా మంది తెలుగువారు వెళ్లొచ్చారు. ఢిల్లీ వెళ్లి  వచ్చిన వారు ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల వారీగా ఏపీ సర్కారు గుర్తించింది.  వారిని ఇప్పుడు క్వారంటైన్ కు తరలిస్తున్నారు.

ఎవరైనా మిస్ అయిన వారుంటే వెంటనే ప్రభుత్వ ఆస్పత్రులకు రావాలని ఏపీ సర్కారు సూచించింది.  త్వరగా తమ ఉళ్ళల్లో ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి చెక్ చేపించుకొని చికిత్స తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది...

సమాజ హితం కోరి మీరు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ సూచించింది. ఈ సందర్భంగా జిల్లాల వారీగా ఢిల్లీ వెళ్లొచ్చిన వారి సంఖ్యను తాజాగా విడుదల చేసింది.

శ్రీకాకుళం జిల్లా          0
విజయనగరం జిల్లా      3
విశాఖపట్నం రూరల్.    1
విశాఖపట్నం సిటీ.      41
తూర్పు గోదావరి జిల్లా    6
పశ్చిమ గోదావరి జిల్లా  16
రాజమండ్రి.              21
కృష్ణ జిల్లా.               16
విజయవాడ సిటీ.        27
గుంటూరు అర్బన్.      45
గుంటూరు రూరల్.      43
ప్రకాశం జిల్లా.            67
నెల్లూరు జిల్లా.           68
కర్నూల్ జిల్లా.         189
కడప జిల్లా.              59
అనంతపూర్ జిల్లా.      73
చిత్తూరు జిల్లా.           20
తిరుపతి.                  16
మొత్తం                    711

రాష్ట్రంలో ఒక్క రోజులో 17 కరోనా పొజిటివ్ కేసులు నమోదు అయినట్టు  ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. తూర్పు గోదావరిలో 4 - అనంతపురం లో 2 కేసులు నమోదయ్యానని తెలిపింది. మొత్తం ఏపీలో  40 కి చేరిన కరోనా పొజిటివ్ కేసులు నమోదయ్యాయని వివరించింది. ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 11 కేసులు నమోదు - ఒక్క చీరాల పట్టణంలో కొత్తగా 5 కేసులు నమోదయ్యాని తెలిపింది. గుంటూరు లో 9 కేసులు నమోదు - విశాఖ లో 6 - కృష్ణ లో 5 కేసులు నమోదు. నిన్న రాత్రి నుండి 164 మందికి కరోనా పరీక్షలు చేసినట్టు తెలిపింది.  అందులో 17 మందికి కరోనా పొజిటివ్ - 147 మందికి కరోనా నెగటివ్ గా నిర్ధారణ అయ్యిందన్నారు.

ప్రకాశం జిల్లాలో 11 కు చేరిన కరోన పాజిటివ్ కేసులు నమోదయ్యాయని.. చీరాల లో 6 - కందుకూరు 3 - ఒంగోలు 1 - కనిగిరి 1 కేసు నమోదైందన్నారు. ఢిల్లీ నిజముద్దీన్ మత ప్రార్ధనలకు వెళ్లి వచ్చిన ఇప్పటివరకు 9 మందికి పాజిటివ్  సోకిందన్నారు. మరిన్ని స్వాబ్ లు పరీక్షల కోసం అధికారులు  పంపారు. ప్రకాశం జిల్లా నుండి నిజముద్దీన్ మత ప్రార్ధనలకు వెళ్లిన సుమారు 280 మందిని క్వారంటైన్ లో ఉంచారు.  కొంతమందిని ఐసోలేషన్ లో ఉంచారు. కరోనా ప్రబలడంతో జిల్లా లో హై అలెర్ట్  ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా లేకపోతే భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.
Tags:    

Similar News