ఐటీరంగం...అత్యంత క్రేజ్ ను కలిగి ఉండే చొక్కా నలగని ఉద్యోగాలకు కేరాఫ్ అడ్రస్. కానీ ఇప్పుడా రంగం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. భారీగా ఉపాధి కల్పనకు నిలయంగా ఉన్న 154 బిలియన్ డాలర్ల దేశీ ఐటీ రంగం తీవ్ర క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుంది. కంపెనీల వ్యాపార పద్దతులు - విధానాలు మారడంతో ఐటీ కంపెనీలు కొత్తగా ఉద్యోగులను నియమించుకోవడంలో తీవ్ర కఠినతరమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయని పరిశ్రమ విశ్లేషణ. ఓ వైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలు - మరోవైపు ఆటోమేషన్ ప్రభావంతో చాలా కంపెనీలు తమ ప్రస్తుత ఉద్యోగులు - నియామకాల విషయంలో పునః సమీక్షించుకోవడం మొదలుపెట్టాయి. తొలిసారి భారతదేశంలోనే అగ్రశ్రేణీ ఐదు ఐటీ కంపెనీల్లోని మూడింటిలో ఉద్యోగులు భారీగా తగ్గిపోయారని ప్రముఖ ఆంగ్ల దినపత్రిక మింట్ ఓ కథనం ప్రచురించింది.
ఐటీలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ దిగజారిపోతుందని మింట్ తన కథనంలో విశ్లేషించింది. దేశంలోని ప్రముఖ ఏడు ఐటీ కంపెనీలు దాదాపుగా 56 వేల మంది ఇంజనీర్లను వెళ్లిపోవాలని సూచించినట్టు వెలువరించింది. తొలిసారి భారతదేశంలోనే అగ్రశ్రేణీ ఐదు ఐటీ కంపెనీల్లోని మూడింటిలో ఉద్యోగులు భారీగా తగ్గిపోయారని విశ్లేషించింది. ప్రస్తుత ఏడాది జూన్30తో ముగిసిన త్రైమాసికం నాటికి ఈ టాప్-5 కంపెనీల్లో 984,913 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. కాగా ఇంతక్రితం మార్చితో ముగిసిన త్రైమాసికం సంఖ్యతో పోల్చితే 1,821 మంది తగ్గిపోయారు. 2017 మార్చి ముగింపు నాటికి దేశీయ ఐటీ పరిశ్రమలో మొత్తంగా 39 లక్షల మంది పని చేస్తున్నారని ఐటీ పరిశ్రమ బాడీ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ (నాస్కామ్) వెల్లడించింది.
ప్రస్తుత ఏడాదిలో ఐటీ రంగంలో కొత్తగా కనీసం 150,000 మందికి ఉద్యోగాలు లభించవచ్చని నాస్కామ్ అంచనా వేసింది. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే నాస్కామ్ అంచనాలు తప్పేలా కనిపిస్తున్నాయని పేర్కొంది. దేశంలోనే అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సర్వీసుల కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)లో జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఉద్యోగుల సంఖ్య 1,414 మంది తగ్గి 3,85,809కి చేరింది. ఇన్ఫోసిస్‌లో నికరంగా 1,811 ఉద్యోగాలు పోయాయి. టెక్ మహీంద్రాలో 1,713 మంది ఉద్యోగాలు తగ్గాయి. కేవలం విప్రో, హెచ్‌సీఎల్‌లు మాత్రమే తమ ఉద్యోగుల నికర సంఖ్యలో పెరుగుదల చోటు చేసుకుంది. అది కూడా బెంగళూరుకి చెందిన ఓ ఐటీ సంస్థతో విప్రో కుదుర్చుకున్న ఒప్పందం సఫలమవడంతో విప్రో అదనంగా ఉద్యోగులను చేర్చుకోగలిగింది. ఇన్ఫోసర్వర్‌ను విప్రో కొనుగోలు చేయడంతో కొత్తగా 200 మంది ఉద్యోగులను తీసుకుంది.
బెంగళూరు కేంద్రంగా పని చేస్తోన్న ఈ కంపెనీ ఒక అవుట్ సోర్సింగ్ క్లయింట్ ద్వారా మరో 1000 మంది ఉద్యోగులను తీసుకుంది. ఇతర ఐటీ కంపెనీలు ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్ లిమిటెడ్ - మైండ్ ట్రీ లిమిటెడ్ - కెపీఐటీ టెక్నాలజీస్ లిమిటెడ్ - హెక్సావేర్ లిమిటెడ్ - సైయంట్ లిమిటెడ్ లు క్రితం జూన్ తో ముగిసిన త్రైమాసికంలో 2,026 మంది ఉద్యోగులను తీసుకున్నాయి. ఈ కంపెనీల్లో మొత్తంగా 77,447 మంది సిబ్బంది పని చేస్తున్నారు.
అంటే దాదాపుగా దేశంలోని అతిపెద్ద 10 ఐటీ కంపెనీలు ఏప్రిల్ నుంచి జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో నికరంగా కొత్తగా 205 మంది ఉద్యోగులను తీసుకున్నాయి. ప్రతీ త్రైమాసికంలో వేలాది మందికి ఉద్యోగాలు కల్పించే ఐటీ పరిశ్రమ నియామకాలపై నీలినీడలు కమ్ముకోవడంతో ఈ రంగంపై ఆశలు పెట్టుకుంటున్న అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన మొదలయ్యింది. భవిష్యత్తులో ఐటీరంగం తీరు తెన్నులు ఎలా ఉండనున్నాయో అనే భయాందోళనలు వెలువడుతున్నాయి.