ఆ దేశ ప్రధాని ఫ్రెండ్ ను కేఫ్ లో కాల్చేశారు

Update: 2022-12-13 04:43 GMT
ప్రశాంతతకు చిహ్నంగా చెప్పుకునే యూరోపియన్ దేశాల్లో ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న నేరాలు.. దారుణాలు భయాన్ని కలిగిస్తున్నాయి. ఎప్పుడు ఏ ఉపద్రవం ముంచుకొస్తుందో అర్థం కానట్లుగా పరిస్థితులు ఉంటున్నాయి. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి ఇటలీ రాజధాని రోమ్ లో చోటు చేసుకుంది. తాజాగా చోటు చేసుకున్న కాల్పుల ఉదంతంలో దేశ ప్రధాని స్నేహితురాలు కాల్పుల్లో చనిపోవటం షాకింగ్ గా మారింది.

ఇటలీ రాజధాని రోమ్ లో అనూహ్య కాల్పుల ఉదంతం సంచలనంగా మారింది. రోమ్ లోని ఫిడెన్ జిల్లాలోని ఒక కేఫ్ లో ఒక అపార్టు మెంట్ కమిటీ మీటింగ్ కు సంబంధించిన కమిటీ సమావేశం ఒకటి కేఫ్ లో పెట్టుకున్నారు. తర్వాతి రోజు జరగాల్సిన సమావేశానికి సంబంధించి ఎజెండాను చర్చించేందుకు కేఫ్ లో కలవాలని కొందరు సభ్యులు భావించారు. వారి సమావేశం జరుగుతుండగా పిస్టల్ పట్టుకొని వచ్చిన ఒక ఆగంతకుడు అందరిని చంపేస్తానని అరుస్తూ.. వారిపై అనూహ్యంగా కాల్పులు జరిపారు.

ఈ కాల్పుల్లో ముగ్గురు మహిళలు మరణించగా.. మరో నలుగురు గాయపడ్డారు. అనంతరం కాల్పులకు పాల్పడిన వ్యక్తిని  అదుపులోకి తీసుకున్న అక్కడి స్థానికులు అనంతరం పోలీసులకు అప్పజెప్పారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 50 ఏళ్ల నికొలెట్టా గొలిసానో మరెవరో కాదు ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ స్నేహితురాలే. ఈ అక్టోబరులో ఆమె ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. బాధితురాలితో ఇటలీ ప్రధాని గతంలో దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. పెట్టిన పోస్టు ఇప్పుడు వైరల్ గా మారింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News