అది కాకులు దూరని కారడవి...చీమలు దూరని చిట్టడవి....ఆ దట్టమైన అడవిలో ఓ నిధి....దానికోసం ట్రెజర్ హంట్....అడవిలో పుట్టకో క్లూ..చెట్టుకో చీటీ....చివరకు హీరో, హీరోయిన్లు ఓ కుక్క సాయంతో ఆ ట్రెజర్ ను కనిపెట్టేస్తారు....ఇదంతా `గోదావరి`సినిమాలోని సన్నివేశం. ఇటువంటి ట్రెజర్ హంట్ సినిమాలు...హాలీవుడ్ లో కోకొల్లలు. అయితే, ఇదే తరహాలో హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొందాడు న్యూ మెక్సికోకి చెందిన ఫార్రెస్ట్ ఫెన్ అనే కోటీశ్వరుడు. పురాతన వస్తువులను సేకరించే అలవాటు ఉన్న ఫెన్ ఓ కంచు భోషాణంలో ఆ నిధిని ఉంచి రాకీ పర్వతాల్లో ఉన్న ఓ నిర్జన అటవీ ప్రదేశంలో ఆ నిధిని దాచిపెట్టాడు.
ఆ నిధిని దక్కించుకోవాని ఆసక్తి ఉన్నవారి కోసం ఓ ట్రెజర్ హంట్ కూడా ఏర్పాటు చేశాడు. ఆ నిధిని సొంతం చేసుకోవాలని ఎంతో మంది ఔత్సాహికులు, ఆశావహులు....తట్టా బుట్టా సర్దుకొని రాకీ పర్వతాల్లో వాలిపోయారు. ఆ గుప్త నిధి కోసం చెట్టు, పుట్టలు, కొండలు, గుట్టలు అంతా వెతికారు. కానీ, ఆ నిధి మాత్రం ఎవ్వరికీ దొరకలేదు. ఫెన్ ఇచ్చిన క్లూలను ఎవరూ కనిపెట్టలేకపోయారు. ఇదంతా పదేళ్ల క్రితం ముచ్చటి. అయితే, పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నించిన ఓ వ్యక్తికి తాజాగా ఆ నిధి దొరికింది. తూర్పు అమెరికా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఆ నిధిని కనుగొన్నారని ఫెన్ వెల్లడించాడు.
పెద్ద కంచు భోషాణం నిండా బంగారం, వజ్ర వైఢూర్యాలు, ఆభరణాలు, విలువైన వస్తువులు.. ఇలా దాదాపు రూ.8 కోట్ల రూపాయల విలువైన నిధిని రాకీ పర్వతాల్లో దాచిపెట్టాడు ఫెన్. ఆ నిధిని కొల్లగొట్టేందుకు ఉద్యోగాలను వదిలేసి మరీ బయలుదేరారు కొందరు. తాము పొదుపు చేసిన డబ్బుతో నిధివేటలో పాల్గొన్నారు మరికొందరు. ఈ నిధి వేటలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు కూడా. పదేళ్ల క్రితం ఎవరికీ దొరకని నిధి తాజాగా దొరికిందని వెల్లడించాడు ఫెన్. రాకీ పర్వత శ్రేణుల్లో పచ్చని అడవుల మధ్య నక్షత్రాల పందిరి కింద ఆ నిధి ఉందని, ఆ నిధిను కనుగొన్న వ్యక్తి వివరాలు తనకు తెలియదని తన వెబ్ సైట్ ద్వారా ప్రకటించాడు.
తన జీవిత కథలో రాసుకున్న 24 పంక్తుల పద్యం ఆధారంగా ఆ నిధి జాడను కనుగొన్నాడని ఫెన్ వెల్లడించాడు. నిధిని సంపాదించిన వ్యక్తి తన పేరును వెల్లడించేందుకు ఇష్టపడలేదని, కానీ ఆ నిధిని, దాన్ని కనుగొన్న ప్రదేశాన్ని ఫోటో తీసి పంపారని ఫెన్ తెలిపాడు. ఎన్నో అరుదైన బంగారు నాణేలు, పురాతన ఆభరణాలు, ప్రీ కొలంబియన్ కాలానికి చెందిన జంతువుల బొమ్మలు, పురాతనకాలం నాటి చేతితో చేసిన బంగారు అద్దాలు, అలాగే పచ్చలతో చెక్కిన చైనీయుల ముఖాలతో తయారు చేసిన పెట్టెలో వాటిని ఉంచినట్లు తెలిపాడు. దాదాపు 9 కేజీల బరువుండే ఆ నిధి విలువ సుమారు 8 కోట్లుంటుందని చెప్పాడు. ఓ వైపు నిధిని కనుగొన్నందుకు సంతోషంగా ఉందని...మరోవైపు నిధి వేట పూర్తయిపోయిందన్న బాధ కూడా ఉందని అంటున్నాడు ఫెన్.