కర్నూలు హోలీః మగాళ్లంతా కాంచనగా మారిపోతారు.. తెలిసిన వాళ్లు కనిపించారంటే..
సహజంగా హోలీ వేడుకలు ఎలా జరుపుకుంటారు? రంగులు చల్లుకుని శుభాకాంక్షలు చెప్పుకుంటారు అంతే కదా! కానీ.. కర్నూలు జిల్లాలోని ఆథోనిలో మాత్రం వింతగా వేడుకలు సెలబ్రేట్ చేసుకుంటారు. అది కూడా ఈనాటిది కాదు.. వందేళ్లుగా కొనసాగుతున్న ఆచారం. ఇంతకీ.. అదేంటో చూద్దామా!
హోలీ పండుగ వేళ మగాళ్లంతా అచ్చం ఆడవాళ్లుగా మారిపోతారు. అంటే.. కట్టు, బొట్టు చీరతో సింగారించుకుంటారు. ఆ తర్వాత హోలీ రోజున రతీమన్మథులను పూజిస్తారు. ఆ తర్వాత నైవేద్యం ఉంచిన పూర్ణ కుంభాన్ని నెత్తిన పెట్టుకొని ఆలయానికి గుంపుగా వెళ్తారు.
ఈ క్రమంలో మరింత వింతగా ప్రవర్తిస్తారు. అలా వెళ్తుండగా.. దారిలో తెలిసిన వారు కనిపిస్తే చాలు బండ బూతులు తిట్టేస్తారట. ఆ వ్యక్తులు గతంలో తమకు ఏదైనా చెడు చేస్తే.. అవన్నీ గుర్తు చేస్తూ నాటు డైలాగులతో ఇష్టమొచ్చినట్టు తిట్టేస్తారట.
మరి, అలా తిడుతుంటే.. వీళ్లేం చేస్తారనే డౌట్ వచ్చేస్తుంది. వీళ్లు ఏం చేస్తారంటే.. దండం పెట్టి శ్రద్ధగా వింటారట. అలా వాళ్లు తిట్టే తిట్లన్నీ తమకు దేవుడిచ్చే దీవెనలుగా భావిస్తారట. ఈ సంప్రదాయం తరతరాలుగా కొనసాగుతోందట. చీరలు కట్టుకున్న మగాళ్లంతా వెళ్లి గ్రామంలోని ఆలయంలో ఉన్న రతీమన్మథుల విగ్రహాలకు పూజలు చేస్తారు.