ఈఎస్ఐ కేసులో ఈ ఉదయం అరెస్ట్ అయిన టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడి వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. అచ్చెన్నాయుడిని పోలీసులు కిడ్నాప్ చేశారని చంద్రబాబు ఆరోపించారు. బీసీలకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వ మోసాలపై పోరాడుతున్న అచ్చెన్నపై జగన్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు పాల్పడుతోందని.. అచ్చెన్న అరెస్ట్ బీసీలపై దాడి అని బాబు మండిపడ్డారు. కనీసం మందులు కూడా వేసుకోనీయలేదని.. ఫోన్ లాక్కున్నారని.. ఇది జగన్ ఉన్మాదం అని మండి పడ్డారు.
ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అచ్చెన్నను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా టీడీపీ శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నను అరెస్ట్ చేయడం.. ఆయనను కిడ్నాప్ చేయడమేన్నారు.
బీసీల సమస్యపై అసెంబ్లీలో నినదిస్తూ ప్రశ్నిస్తున్నందుకే అచ్చెన్నాయుడిని కిడ్నాప్ చేశారని చంద్రబాబు ఆరోపించారు. అచ్చెన్న అరెస్ట్ కు నిరసనగా బడుగు బలహీన వర్గాల ప్రజలు నిరసనలు తెలియజేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఫూలే, అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు ఇవ్వాలని చంద్రబాబు టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.