అచ్చెన్నాయుడు అరెస్ట్‌ పై హోంమంత్రి కీలక వ్యాఖ్యలు !

Update: 2020-06-12 08:30 GMT
మాజీ మంత్రి , టీడీఎల్పీ ఉపనేత, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్ట్‌ పై ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత స్పందించారు. మందుల కొనుగోళ్లలో ఆయన అక్రమాలకు పాల్పడిన నేపథ్యంలోనే ఆయనను అరెస్టు చేశారని తెలిపారు. వైద్య పరికరాల కొనుగోళ్లలోనూ అవినీతి జరిగిందని ఆమె చెప్పారు. అచ్చెన్నాయుడు అరెస్ట్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు. సీఎం జగన్ ను అరెస్ట్ చేసినప్పుడు సంబరాలు చేసుకున్నవారు ఇప్పుడెలా మాట్లాడతారని ప్రశ్నించారు.  

చంద్రబాబు చెప్పినట్లుగా అచ్చెన్నాయుడిని లాక్కుని వెళ్లలేదని, మామూలుగానే తీసుకెళ్లారని తెలిపారు. మందుల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారు కాబట్టే అచ్చెన్నాయుడ్ని అరెస్ట్ చేశారు. వైద్య పరికరాల కొనుగోళ్లలనూ అవినీతి జరిగిందన్నారు. అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవద్దా?, అది కేంద్ర ప్రభుత్వ డబ్బయినా, రాష్ట్ర ప్రభుత్వం డబ్బయినా చర్యలు తీసుకోవాలి కదా? అని హోంమంత్రి సుచరిత చెప్పుకొచ్చారు. కాగా, అచ్చెన్నాయుడిని ఇవాళ ఉదయం శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలోని ఆయన నివాసంలో ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సాయంత్రం 4గంటలకు విజయవాడలో ఏసీబీ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చనున్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు.
Tags:    

Similar News