అచ్చెన్నాయుడుకు 14 రోజుల రిమాండ్

Update: 2020-06-13 04:30 GMT
ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడికి ఏసీబీ న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. ఈఎస్ఐ కుంభకోణం కేసులో ఏ2గా అచ్చెన్నాయుడు ఉన్నారు.

శుక్రవారం అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసిన అధికారులు వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం మంగళగిరి ఏసీబీ న్యాయమూర్తి నివాసానికి తరలించారు. ఆయనతోపాటు రమేశ్ కుమార్ ను కూడా అధికారులు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ఈ క్రమంలో ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి అచ్చెన్నాయుడు, రమేశ్ కుమార్ లకు రెండు వారాల రిమాండ్ విధిస్తూ ఆదేశారు జారీ చేశారు.

అయితే అచ్చెన్నాయుడు అనారోగ్య కారణాల దృష్ట్యా ఆయనను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారు.

ప్రస్తుతం జడ్జి ఆదేశాల మేరకు తొలుత విజయవాడ జైలుకు తరలించారు. జైలు అధికారులు అచ్చెన్నాయుడికి ఖైదీ నంబర్ 1573 కేటాయించారు.  పోలీసులు అనంతరం జైలు అధికారుల అనుమతితో ఆయనను జీజీహెచ్ ఆస్పత్రికి తీసుకెళ్లనున్నారు.

ఇక ఈఎస్ఐ కుంభకోణం కేసులో ఏ1గా ఉన్న ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ రమేశ్ కుమార్ కు కూడా రెండు వారాల పాటు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. రమేశ్ కుమార్ ను అధికారులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
Tags:    

Similar News