వర్క్ ఫ్రం హోం చేస్తూ ఆ పనికి బానిసై ... సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య !
ప్రపంచంలోనే ఐటీ సంస్థల్లో దిగ్గజ సంస్థ అయిన ఇన్ఫోసిస్ లో ఉద్యోగం , లక్షల రూపాయల ప్యాకేజీ. చిన్నప్పటి నుండి పడిన కష్టానికి తగిన ఫలితం దొరికింది అని అనుకున్నారు. అందరూ ఎంతో సంతోషించారు. ఎలాంటి చెడు అలవాట్లు లేని అతడికి అనుకోకుండా కరోనా మహమ్మారి ఎఫెక్ట్ తో వర్క్ ప్రం హోం వల్ల టైమ్ పాస్ కోసం మొదలు పెట్టిన ఓ ఆట చివరికి ప్రాణాన్నే తీసింది. ఆన్ లైన్ లో క్రికెట్ బెట్టింగ్ ఆ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు. బెట్టింగ్ డబ్బులు ఇచ్చేందుకు జీతం చాలక అప్పులు చేసి, ఆ అప్పులను తీర్చలేక కుటుంబానికి భారం కాలేక చివరకు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
హైదరాబాద్ లో జరిగిన ఈ దుర్ఘటనకి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే .... హైదరాబాద్ లోని పటాన్ చెరులోని చైతన్యనగర్ కాలనీకి చెందిన ఓ యువకుడు బెంగళూరు ఇన్ఫోసిస్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. లాక్ డౌన్ నేపథ్యంలో పటాన్ చెరులోని ఇంట్లోనే ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా విధులు నిర్వర్తిస్తున్నాడు.
ఈ సమయంలో టైమ్ పాస్ కోసం ఆన్ లైన్ బెట్టింగ్ లకు బానిసగా మారిపోయాడు. దానికి బానిసై తీవ్రంగా అప్పుల పాలయ్యాడు. ఆ విషయం తెలిసి అతని తండ్రి ప్రభాకర్ దాదాపు లక్ష రూపాయల అప్పు తీర్చాడు. అయినా బెట్టింగ్ డబ్బుల కోసం చేసిన అప్పులు పూర్తిగా తీరలేదు.
దీంతో ఏం చేయాలో తెలియక తీవ్ర మనోవేదనను అనుభవించి, తన కారణంగా కుటుంబం కూడా ఇబ్బందుల్లో చిక్కుకుంటుందోని భావించి , ఈ నేపథ్యంలోనే బలవన్మరణానికి పాల్పడ్డాడు. తండ్రి విధులకు వెళ్లగానే బెడ్ రూమ్ లో చీరతో ఫ్యాన్ కు ఉరేసుకున్నాడు. ఇది గమనించిన అతని తల్లి, అతడిని రక్షించేందుకు సాయం కోసం పక్కింటి వారిని పిలిచింది. అందరూ కలిసి అతనిని హుటాహుటిన ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
అయితే రవిని వైద్యులు పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. దీంతో వైద్య పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వ వైద్యులు అప్పటికే అతడు మరణించాడని చెప్పారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చేతికి అందివచ్చిన కొడుకు కళ్లముందే విగత జీవిగా పడి ఉండటం చూసి ఆ తల్లి రోదనను ఆపడం ఎవరి తరం కావడం లేదు.