కేసీఆర్ నిర్ణ‌యాన్ని కేంద్రం మెచ్చింది

Update: 2015-09-21 16:09 GMT
ఆలిండియా టెక్నికల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. రాసి కంటే వాసికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు సాగుతున్న ఇంజినీరింగ్ సీట్లలో భారీ కోత విధించాలని చూస్తోంది. రాబోయే రెండు మూడేళల్లో సీట్ల సంఖ్యను దాదాపు 40 శాతానికి పరిమితం చేసేందుకు కసరత్తు సిద్ధం చేస్తోంది. ఇంజినీరింగ్ విద్యార్థులో నాణ్యత ప్రమాణాలు పడిపోవడం, కాలేజీల్లో మౌళిక సదుపాయాలు సరిగ్గా లేకపోవడం వంటి కారణాల వల్ల సీట్ల సంఖ్యను తగ్గించాలని ఏఐసీటీఈ ఈ నిర్ణయం తీసుకునేందుకు రెడీ అయింది.

తెలంగాణ‌లో పెద్ద ఎత్తున ఉన్న ఇంజినీరింగ్ కాలేజీల వ‌ల్ల ప్ర‌యోజనం ఏమీలేద‌ని...కేవ‌లం విద్యార్థులు మాత్ర‌మే బ‌య‌ట‌కు వ‌స్తున్నారు త‌ప్ప వారిలో నైపుణ్యాలు ఏమీ ఉండ‌టం లేద‌ని తెలంగాణ సీఎం కేసీఆర్ భావించారు. ఈ నేప‌థ్యంలో అన్ని కాలేజీల‌పై విచార‌ణ జ‌రిపి కొన్ని కాలేజీల‌ను మూత‌వేయించారు. ఈ క్ర‌మంలో పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేల కాలేజీల‌ను కూడా ఉపేక్షించ‌లేదు. ఇదిలాఉండగా...ఏఐసీటీఈ సైతం సీట్ల కుదింపు దిశ‌గా అడుగులు వేసింది.

“ప్రస్తుతం ఏఐసీటీఈ పరిధిలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో దాదాపు 16 లక్షల ఇంజినీరింగ్ సీట్లు ఉన్నాయ. వీటిని 6 లక్షలకు కుధించాలని నిర్ణయం తీసుకోనున్నాం. ఈ నిర్ణయం విద్యార్థులకు నాణ్యమైన విద్యా అందించడంలో, కాలేజీల నుంచి నైపుణ్యవంతులైన మానవవనరులు బయటకు రావడంలో దోహదపడుతుంది.”అని ఏఐసీటీఈ చైర్మన్ అనిల్ సహస్ర బుదే తెలిపారు. అయితే కాలేజీలను మూసివేయడం ఆఘమేఘాల మీద నిర్ణయం తీసుకోబోమని, విద్యార్థుల ప్రయోజనాల కూడా పరిగణనలోకి తీసుకుంటామని ఆయన ప్రకటించారు. దేశంలోని మొత్తం కాలేజీల్లో 70 శాతం కాలేజీల్లో ఘోరమైన విద్యాప్రమాణాలు ఉన్నాయని, నాణ్యమైన ఫ్యాకల్టీ లేకపోవడంవల్ల విద్యార్థులకు సబ్జెక్ట్ లపై ఆసక్తికలగడం లేదని ఆయన తెలిపారు.

విద్యార్థుల్లో నైపుణ్యాలు ఉండటం లేదంటూ…ఇంజినీరింగ్ కాలేజీల్లో క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించే కాలేజీలు ఏఐసీటీఈకి పదేపదే ఫిర్యాదు చేస్తున్నాయి. దేశంలోని టాప్ టెన్ కాలేజీలు అయిన నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)లు, బిట్స్ పిలానీ తప్పఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థుల్లో అస్సలు నైపుణ్యం ఉండటంలేదంటూ పేర్కొంటున్నాయి. ఏఐసీటీఈ తాజా నిర్ణయంతో ఇంజినీరింగ్ విద్యపై నిజంగా ఆసక్తి ఉన్న విద్యార్థులే ఆ కోర్సును చదువుకుంటారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏఐసీటీఈ చైర్య ప్రమాణాలు పెంచడంలో ఉపకరిస్తుందని భావిస్తున్నారు. ఏఐసీటీఈ తదుపరి కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం వెలువడనుంది.
Tags:    

Similar News