హోలీ ఆడొద్దంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చిన ఎయిమ్స్ వైద్యులు

Update: 2020-03-09 05:00 GMT
కొందరు ఈ రోజున (సోమవారం) మరికొందరు రేపు (మంగళవారం) హోలీ జరుపుకునేందుకు ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. ఆనందోత్సాహా ల మధ్య ప్రతి ఏటా జరిగే హోలీ పండక్కి సంబంధించి కీలక ప్రకటన చేయటమే కాదు.. తీవ్రమైన వార్నింగ్ ఇచ్చారు ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు. కరోనా నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో నూ హోలీ ఆడొద్దంటూ వారు స్పష్టం చేస్తున్నారు.

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువ అవుతున్న వేళ.. ప్రజలు గుమిగూడి వేడుకలు జరుపుకోవద్దని చెప్పారు. ఇప్పటికే దేశంలో 40 వరకు కరోనా కేసులు నమోదు అయ్యాయని.. ఈ నేపథ్యంలో హోలీ ఆడకుండా పరిసరాల్ని శుభ్రం గా ఉంచుకోవాలన్నారు.

జలుబు.. దగ్గు ఉన్న వ్యక్తుల తో హోలీ ఆడితే ఇన్ఫెక్షన్లు త్వరగా వచ్చే ప్రమాదం ఉంటుందని ఎయిమ్స్ వైద్యులు చెబుతున్నారు. వీలైనంతవరకూ హోలీ ఆపేయటం చాలా మంచిదన్నారు. హోలీకి ఉపయోగించే రంగుల్లో కెమికల్స్ ఉంటాయని.. దీని వల్ల అలర్జీలు.. చర్మ సంబంధిత సమస్యలు తలెత్తే వీలుందని చెబుతున్నారు. సో.. హోలీ ఆడాలన్న ప్లాన్ ఉంటే అర్జెంట్ గా దాన్ని వాయిదా వేసుకోవటం చాలా మంచిదన్నది మర్చిపోకూడదు.
Tags:    

Similar News