ప్రముఖ విద్యా సంస్థ శ్రీ చైతన్యకు నోటీసు ఇచ్చారు. తమ దగ్గర చేరితే చాలు.. మెడికల్ సీటు పక్కా అని.. ఒకవేళ నిట్ లో సీటు వచ్చేలా చేయలేకపోతే.. మొత్తం ఫీజులో 65 శాతం మొత్తాన్ని వెనక్కి ఇచ్చేస్తామంటూ భారీగా ఇచ్చిన ప్రకటనలపై రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మండిపడింది. సీటు పక్కా అంటూ ప్రకటనలు ఎలా ఇస్తారంటూ ప్రశ్నించిన అధికారులు.. ఈ తరహాలో ప్రకటనలు ఇవ్వటం చట్టవిరుద్ధమంటూ పేర్కొంది.
మీ మీద చర్యలు ఎందుకు తీసుకోకూడదంటూ నోటీసులు జారీ చేసింది. విద్యార్థుల్ని.. వారి తల్లిదండ్రుల్ని పక్కదారి పట్టించేలా ప్రకటనలు జారీ చేసిన ఈ విద్యా సంస్థపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలంటూ సదరు విద్యా సంస్థకు అధికారులు జారీ చేశారు. 15వేల మందికి మెడికల్ సీట్లు వచ్చే అవకాశం ఉందంటూ మోసపూరితంగా ప్రకటనలు ఇస్తుందన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు సదరు విద్యా సంస్థకు నోటీసులు ఇచ్చారు. తెలుగు విద్యార్థుల్ని ప్రలోభ పెట్టేలా ఉన్న ప్రకటనలు ఇచ్చిన శ్రీచైతన్య విద్యాసంస్థపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. మరి.. దీనికి శ్రీచైతన్య ఏం బదులిస్తుందో చూడాలి.