జ‌గ‌న‌న్న : అక్షయ పాత్ర సరే అన్నా క్యాంటీన్ల కథేంటి?

Update: 2022-02-19 14:30 GMT
అక్ష‌య పాత్ర అయినా, గోరు ముద్ద అయినా, అన్నా క్యాంటీన్ అయినా పేరు ఏద‌యినా గుర్తుకువ‌చ్చేది పేదలే ! వారికి సాయం అందించి వారి నేతృత్వంలోనే మ‌ళ్లీ నాటి అన్నా క్యాంటీన్ల‌ను ప్రారంభిస్తే ఎంతో బాగుంటుంది.పేరు మార్పు చేసి రాజ‌న్న పేరిట, జగగన్న పేరిటో ప‌దుగురికీ అన్నం పెడితే ఇంకా బాగుంటుంది అన్న‌ది రాజ‌కీయ ప‌రిశీల‌కుల ప్ర‌తిపాద‌న. వింటున్నావా జ‌గ‌న్! అదేవిధంగా వీటి నిర్వ‌హ‌ణ‌ను రైతుల‌కు అప్ప‌గిస్తే ఇంకా మేలు కూడా! వారికి ఆర్థికంగా ఊతం ఇచ్చిన వారు అవుతారు కూడా!

ఎక్క‌డ‌యినా స‌రే జ‌గ‌న‌న్న పేరు వింటే చాలు అక్క‌డ మంచి ప‌థ‌కాలు స్మ‌ర‌ణ‌కు రావాల‌ని వైసీపీ అంటోంది. ఆ విధంగా జ‌గ‌న్ సంబంధిత ప్ర‌ణాళిక‌ల రూప‌క‌ల్ప‌న‌లో ఉన్నారు .అందుకు త‌గ్గ నిధులు త‌న ద‌గ్గ‌ర లేక‌పోయినా మొండి ధైర్యంతో ముందుకు దూసుకుపోతున్నారు. ముఖ్యంగా  సంక్షేమ ప‌థ‌కాల అమ‌లులో దేశంలోనే అత్య‌ధిక నిధులు వెచ్చిస్తున్న రాష్ట్రంగా ఏపీ ఉంది. అదేవిధంగా వ్య‌వ‌సాయ రంగంలో అధిక పెట్టుబడులు త‌క్కువ రాబ‌డులు ఉన్న రాష్ట్రంగానూ ఏపీనే ఉంది. అంటే ఏపీకి వ్య‌వ‌సాయం లాభరూపేణా అచ్చిరావ‌డం లేద‌నే తేలిపోయింది.

కానీ జ‌గ‌న్ మాత్రం   ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఇప్ప‌టికీ విమ‌ర్శ‌లు దాట‌లేకపోతున్నారు.ప్ర‌భుత్వ‌మే ధాన్యం కొనుగోలు చేసి రైతుల‌ను ఆదుకుంటుంది అన్న మాట పైకి చెప్పినా అమ‌లు అలా లేదు.

ఈ నేప‌థ్యంలో ఆయ‌న ప్ర‌భుత్వం త‌ర‌ఫున సాయం అంద‌క రైతులు గ‌గ్గోలు పెడుతున్నారు. ఇదే సంద‌ర్భంలో బిడ్డ‌ల‌కు ప‌ట్టెడ‌న్నం పెట్టేందుకు అక్ష‌య పాత్ర  అనే కార్య‌క్ర‌మం నిన్న‌టి వేళ మొద‌లు పెట్టారు.కేంద్రీకృత వంట‌శాల‌లు ప్రారంభించారు. వీటి ద్వారా మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కం అమ‌లుకు సంబంధించి ఆయా పాఠ‌శాల‌ల‌కు వాహ‌నాల ద్వారా ఆహారం స‌ర‌ఫ‌రా చేయనున్నారు.

గుంటూరు జిల్లా, మంగ‌ళ‌గిరి మండ‌లం, ఆత్మ‌కూరు వ‌ద్ద ఇస్కాన్ నేతృత్వంలో ఏక కాలంలో ఐదు వంద‌ల మందికి భోజ‌నాలు సిద్ధం చేసే కేంద్రీకృత వంట శాల‌ను ఇస్కాన్ సిద్ధం చేయ‌గా దీనిని ముఖ్య‌మంత్రి ప్రారంభించారు. ఆ విధంగా మ‌ళ్లీ రైతులే గుర్తుకు వ‌స్తున్నారు.దేశానికి అన్నం పెట్టే రైత‌న్న‌కు సాయం చేయాల్సిన ప్ర‌భుత్వాలు త‌మ ధ‌ర్మం మ‌రిచి ప్ర‌వ‌ర్తిస్తున్నాయా లేదా ఎంత చేసినా సాయం వాళ్ల‌కు అంద‌డం లేదా ? అని ! ఇక అక్ష‌య పాత్ర సాయంతో విద్యార్థుల‌కు మంచి భోజ‌నం అందుతుంది వీటికి స‌రిప‌డా నాణ్య‌మైన బియ్యం అందించే ప‌ని ప్ర‌భుత్వం తీసుకుంటే చాలు, శుభ్ర‌మ‌యిన రీతిలో న‌డిచే భోజ‌న ప‌థ‌కం ఇక‌పై ఆగ‌మ‌న్నా ఆగ‌దు.

అదేవిధంగా ఇదే సంద‌ర్భంలో అన్నా క్యాంటీన్లకు కూడా ఆ రోజు భోజ‌నం అందించింది ఇస్కాన్ సంస్థే ! మ‌రి! ఆ రోజు ఇస్కాన్ అందిస్తామ‌న్నా అన్నా క్యాంటీన్ల‌ను ఏక‌ప‌క్షంగా వైసీపీ మూయించివేసింద‌న్న ఆరోప‌ణ టీడీపీ ఇప్ప‌టికీ చేస్తుంది. క‌నుక ఇప్ప‌టికైనా ఇస్కాన్ తో క‌లిసి రాజ‌న్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి రైతులే వాటి నిర్వ‌హ‌ణను చూసేలా చేయండి.

అంటే వాటికి అవ‌ర‌స‌రం అయ్యే బియ్యం , కూర‌గాయ‌లు, ఇత‌ర స‌రకులు సేంద్రియ ప‌ద్ధతుల్లో సాగుచేసి అందించేందుకు రైతుల‌ను ప్రోత్స‌హిస్తే, ఆ విధంగా జ‌గ‌న్ చ‌ర్య‌లు తీసుకుంటే బాగుంటుంది అన్న‌ది ఇవాళ ప‌రిశీల‌కుల నుంచి వినిపిస్తున్న వాద‌న.
Tags:    

Similar News