తెలుగు సినీ ప్రేక్షకుడికి సుపరిచితుడు.. కమెడియన్ గా వందలాది చిత్రాల్లో నటించిన ఆలీ పొలిటికల్ ఎంట్రీపై స్పష్టత వచ్చేసినట్లే. ఇటీవల కాలంలో ఆయన పలు పార్టీల్లో చేరుతున్నట్లుగా వార్తలు వచ్చినా.. అందరూ ఆశ్చర్యపోయేలా ఆయన తాజా నిర్ణయం ఉందని చెబుతున్నారు. మొన్నటివరకూ తెలుగుదేశం పార్టీలో ఆయన చేరనున్నట్లుగా ప్రచారం జరిగింది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఆలీ..జనసేన పార్టీలో చేరతారని.. ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్నట్లుగా ప్రచారం జరిగింది. అయితే.. అనుకోని కారణాలతో ఆయన జనసేన నుంచి టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం సాగింది. దీనికి బలం చేకూరేలా ఆయన ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. దీంతో.. ఆయన టీడీపీలో చేరటం లాంఛనమేనని.. ఆయనకు అసెంబ్లీ టికెట్ కన్ఫర్మ్ అయినట్లుగా ప్రచారం జరిగింది.
ఇదిలా ఉంటే.. ఆదివారం ఊహించని రీతిలో పరిణామాలు చోటు చేసుకున్నాయి. తాజాగా ఆయన చూపు వైఎస్సార్ కాంగ్రెస్ మీద పడింది. ఇప్పటివరకూ అందుతున్న సమాచారం ప్రకారం సోమవారం కాకినాడలో జరిగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమర శంఖారావం సభలో అలీ జగన్ పార్టీలో చేరనున్నట్లు చెబుతున్నారు. ఆ సభలో జగన్ చేతుల మీదుగా పార్టీ కండువా కప్పుకొని పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.
తాజా పరిణామంతో అలీ అసెంబ్లీకి పోటీ చేస్తారా? ఎంపీగా పోటీ చేస్తారా? అన్నది ప్రశ్నగా మారింది. ఇప్పటివరకూ ఆయన గుంటూరు పశ్చిమ లేదంటే రాజమండ్రి అసెంబ్లీ స్థానాల్లో ఏదో ఒకదాని నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. మరి.. జగన్ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.