వామ్మో.. ఆలీబాబా అంత పని రాక్షసుడా?

Update: 2016-04-23 10:05 GMT
జీవితంలో ఒకటి కావాలంటే మరొకటి వదులుకోవాలన్న సూత్రాన్ని తరచూ చెబుతుంటారు. కానీ.. చైనాలోని కంపెనీల తీరు చూస్తే.. జీవితంలో బతకాలంటే పని మాత్రమే చేయాలి. అదే నిన్న బతికిస్తుందన్నట్లుగా వ్యవహరించటం కనిపిస్తుంది. మనిషి జీవితంలో పని ఒక భాగమే కానీ.. పనే జీవితం కాకూడదని చాలామంది చెప్పినా.. చైనా కంపెనీలు మాత్రం అలా వ్యవహరించవంట.

అమెరికా.. యూరప్ లాంటి దేశాల్లో వారానికి ఐదు రోజులు పని విధానం అమల్లోకి ఉండటమే కాదు.. కొన్ని దేశాల్లో అయితే.. మధ్యాహ్నం కచ్ఛితంగా రెండు గంటల సమయం రెస్ట్ తీసుకోవాలన్న నిబంధనలు పెట్టుకోవటం చూస్తాం. కానీ.. చైనాలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు ఉంటాయట. ప్రపంచ ఈ కామర్స్ రంగంలో అద్భుతమైన విజయాలు సాదించి.. అందరి తలలో నాలుకలా మెదిలే ఆలీబాబా కంపెనీలో ఉద్యోగులు నిత్యం నరకాన్ని చూస్తారట. చిన్న కంపెనీగా స్టార్ట్ అయి.. వేలాది కోట్ల రూపాయిలు సంపాదించిన ఆలీబాబా.. తన ఉద్యోగుల పని విషయంలో అసలుసిసలు రాక్షసుడిలా వ్యవహరిస్తారట.

ఆ విషయాన్ని ఎవరో కాక.. ఆయన జీవిత చరిత్ర రాసిన పుస్తకంలో పేర్కొనటం గమనార్హం. 1999లో ఆలీబాబా ఈ కామర్స్  కంపెనీని స్టార్ట్ చేసిన సమయంలో సంస్థ సీఈవో జాక్ మా తీరు పని రాక్షసుడికి ప్రతిరూపంలా ఉండేదట. తన కంపెనీలో పని చేసే ఉద్యోగులు.. పని ప్రాంతానికి పదినిమిషాల దూరంలోనే ఉండాలన్న నిబంధనను తూచా తప్పకుండా అమలు చేస్తారట. ఒక ఉద్యోగి మాత్రం తన వర్క్ ప్లేస్ కి పదిహేను నిమిషాల దూరంలో ఉన్నాడట. ఆ ఉద్యోగిని నిర్ధాక్షిణ్యంగా పని నుంచి తొలగించాడట.

అంతేకాదు..  తన కంపెనీలో పని చేసే ఉద్యోగులు రోజులో 21 గంటలు పని చేసేలా జాక్ ఆదేశాలు ఉంటాయి. ఉద్యోగులు పని.. పని.. పని.. తప్ప వారి జీవితాల్లో మరింకేమీ ఉండకూదని భావించటం గమనార్హం. కంపెనీని షురూ చేసిన సమయంలో పని రాక్షసుడిగా పని చేయించిన జాక్.. తర్వాతి కాలంలో కంపెనీ లాభాల  బాట పట్టిన తర్వాత మాత్రం తాను విధించిన కఠిన నిబంధనల్ని కాస్త తగ్గించారట. ఈ ఉదంతం గురించి విన్నప్పుడు అనిపించేది ఒక్కటే.. ఆలీబాబా సంస్థ సక్సెస్ వెనుక వేలాది ఉద్యోగుల జీవితాలున్నట్లు కనిపించక మానవు.
Tags:    

Similar News