రజినీ సార్..మాకు మద్దతు ఇవ్వండి ..తిట్టిన నోర్లే ఇప్పుడిలా!

Update: 2020-12-30 23:30 GMT
నువ్వసలు ఈ రాష్ట్రానికి చెందిన వాడివే కాదు...ద్రవిడ నేలలో ఆధ్యాత్మిక రాజకీయాలు ఏంటీ..సినిమా వాళ్లు రాజకీయం చేయకుండానే ఏకంగా సీఎం కావాలనుకుంటున్నారు..నిన్నటి వరకు రజనీపై పేలిన విమర్శలు ఇవి. అయితే రజినీ కాంత్ రాజకీయాల్లోకి రానంటూ నిన్న సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

దీంతో నిన్నటి దాకా రజినీని బండ బూతులు తిట్టిన పార్టీలు ఇప్పుడు ప్లేట్ ఫిరాయించాయి. ఇప్పుడు ఒక్కసారిగా ఆయనను పొగడటం స్టార్ట్ చేసాయి. చాలా పార్టీలు ఆయన రాజకీయ నిర్ణయాన్ని స్వాగతించాయి. రజినీ ఓ మంచి నిర్ణయం తీసుకున్నారని, ఆయన ఆరోగ్యంతో ఉండాలని కోరుకున్నాయి. పనిలో పనిగా తమకు మద్దతు ఇవ్వాలని రజినీని వేడుకుంటున్నాయి. ఒక్క రోజులోనే మాటలు మార్చిన రాజకీయ నాయకుల తీరు చూసి తమిళ జనం ముక్కున వేలేసుకుంటున్నారు.

అధికార అన్నా డీఎంకే పార్టీ మొన్నటి వరకూ రజినీని ఓ రేంజ్ లో తిట్టి పోసింది. ఇప్పుడు మాత్రం తమిళనాడులో ఎమ్జీఆర్ పాలన కొనసాగాలంటే మళ్ళీ అన్నా డీఎంకే గెలవాలని, అందుకు మద్దతు ఇవ్వాలని ఆ పార్టీ సీనియర్ నేత మాఫోయ్ పాండ్య రాజన్ రజీనికి విన్నవించారు.

ఓ మంచి పార్టీకి మద్దతు ఇవ్వాలని టీఎంసీ నేత మూపనార్, దేశ భవిష్యత్తు కోసం బీజేపీకి మద్దతు ఇవ్వాలని ఇల గణేషన్ సూపర్ స్టార్ కు విన్నపాలు చేశారు. వీరే కాదు రజినీ రాజకీయాల్లోకి రానని ప్రకటించడంతో తమిళనాడులో చిన్నా చితకా పార్టీలన్నీ ఆయన మద్దతు పొంది ఓట్లు వేయించుకుందాం అని వ్యూహాలు పన్నుతున్నాయి. మరి వారి వ్యూహాలకు రజినీ కాంత్ చిక్కుతారో లేదో చూడాలి.
Tags:    

Similar News