దేశంలో తొలి టీకా తీసుకున్న వ్యక్తికి అలర్జీ

Update: 2021-01-17 10:06 GMT
దేశంలో తొలి వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తికి అలర్జీ వచ్చింది. శనివారం దేశవ్యాప్తంగా ప్రారంభమైన వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఢిల్లీ ఎయిమ్స్ సెక్యూరిటీ గార్డు మనీష్ కుమార్ మొదటి టీకా తీసుకున్నాడు.

అయితే తాజాగా అతడు అలర్జీ బారినపడినట్లు ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా వెల్లడించారు. వెంటనే అతడికి ఐసీయూలో చికిత్స అందించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం మనీష్ ఆరోగ్యం బాగానే ఉందని.. ఇవాళ డిశ్చార్జ్ అవుతాడని తెలిపారు.

దేశవ్యాప్తంగా మొత్తం 3351 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ నిర్వహించారు. ఈ ప్రక్రియలో 16755 మంది సిబ్బంది పాల్గొన్నారని కేంద్రం తలిపింది. కోవిన్ యాప్ లో సాంకేతికపరమైన సమస్యలు తలెత్తడంతో కొన్ని చోట్ల వ్యాక్సినేషన్ ఆలస్యమైందని తెలిపింది.

ఢిల్లీలోని ఎయిమ్స్ లోనూ వ్యాక్సినేషన్ నిర్వహించారు. అయితే అక్కడ టీకా తీసుకున్న వ్యక్తి అస్వస్థత బారినపడడం కలకలం రేపింది.
Tags:    

Similar News