చిత్తూరు జిల్లా పలమనేరు వైసీపీ శాసనసభ్యుడు ఎన్.అమరనాథరెడ్డి పార్టీ మారిన ముహుర్తం బాగా లేనట్లుంది. కండువా కప్పుకొంటున్న క్రమంలోనే ఆయన పెద్ద ఎత్తున మొత్తానికి అమ్ముడుపోయాడని వార్తలొచ్చాయి. ఆయన సైకిలెక్కిన తర్వాత నియోజకవర్గంలో వైసీపీ పోస్టర్ల ప్రచారం చేసింది. పార్టీ వదిలిపెట్టిపోవడం సరే కానీ మేం వేసిన ఓట్లు తిరిగి ఇచ్చేయ్ అంటూ పరోక్షంగా రాజీనామాకు డిమాండ్ చేశారు. అయితే ఈ పరిణామంపై హర్టయిన అమరనాథరెడ్డి వివరణ ఇచ్చారు.
వైకాపా నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరిన తరవాత మొట్టమొదటి సారిగా పలమనేరుకు వెళ్లిన సందర్భంగా సమావేశం ఏర్పాటు చేసి మరి ఆయన వివరణ ఇచ్చారు. ‘వ్యాపారాలు చేసుకోవడానికో నేను రాజకీయాలు చేయడంలేదు. కేవలం ప్రజల సంక్షేమం - నన్ను ఎమ్మెల్యేగా గెలిపించి ఎంతో నమ్మకం ఉంచిన ప్రజల కోసం మాత్రమే పనిచేస్తాను. ప్రజా సంక్షేమానికి కట్టుబడి వెనక్కు వచ్చాను. అభిమానుల్ని కార్యకర్తలను ఇంత కాలం వదలుకున్నందుకు బాధగా ఉంది’అని అన్నారు. 35 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నానని తన తండ్రి నుంచి రాజకీయ పాఠాలు నేర్చుకున్నానని గద్గద స్వరంతో వ్యాఖ్యానించారు. కొన్ని కారణాల వల్ల అప్పట్లో పార్టీని వదలినా ఇప్పుడు తన సొంత పార్టీలోకి తిరిగి వస్తుంటే కార్యకర్తలు - నాయకులు తన మీద చూపిస్తున్న అభిమానానికి సంతోషంగా ఉందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ అభిమానాన్ని చిరకాలం నిలుపుకోవడానికి అంకితభావంతో పార్టీ అభివృద్ధికి - ప్రజా సంక్షేమానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
తనపై విమర్శలు చేసే వారు ఒకసారి ఆలోచించుకోవాలని అమరనాథ్ రెడ్డి అన్నారు. విమర్శలకు సమాధానం చెప్పడానికి ఏమాత్రం వెనకాడబోనని, అయితే పద్ధతి మరచిపోయి విమర్శిస్తే మాత్రం దీటుగా సమాధానం చెప్పడానికి వెనకాడబోనని హెచ్చరించారు. వైకాపా నుంచి తెలుగుదేశం పార్టీలో చేరికలుంటున్న నేపథ్యంలో ప్రతిపక్ష నాయకుడు జగన్ ఎక్కడ తప్పు జరుగుతుందో తెలుసుకోవాలని సూచించారు. తెలుసుకోకుంటే నష్టపోయేది ఆయనేనని అన్నారు.