స్పీక‌ర్ మాట:అంబేద్క‌ర్ - మోడీ బ్రాహ్మ‌ణులే

Update: 2018-04-30 08:31 GMT
పార్టీ నేత‌లు నోరు అదుపులో పెట్టుకోవాల‌ని...వివాద‌స్ప‌ద అంశాల్లో జోక్యం చేసుకోవ‌ద్ద‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ చెప్పిన‌ప్ప‌టికీ...బీజేపీ నేతల వివాదాస్పద వ్యాఖ్యల పరంపర కొనసాగుతూనే ఉంది. ఏకంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ ఇలాకా అయిన గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర త్రివేది కూడా ఈ లిస్ట్‌లో చేరారు. రాజ్యంగ నిర్మాత‌ - బ‌హుజ‌నుల ఆరాధ్య‌నీయుడు అయిన‌ అంబేద్కర్ - బీజేపీ బీసీలు త‌మ వ‌ర్గానికి చెందిన ముఖ్యడుగా చెప్పుకొనే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీలు అగ్ర‌వ‌ర్ణానికి చెందిన బ్రాహ్మణులే అని త్రివేది అన్నారు. వాళ్లకున్న విజ్ఞానం, తెలివితేటల పరంగా చూస్తే అంబేద్కర్ - మోడీలు బ్రాహ్మణులే అని సూత్రీక‌రించారు.

ఈ మధ్యే ఓ కార్యక్రమంలో రాజేంద్ర త్రివేది మాట్లాడుతూ.. మోడీ, అంబేద్కర్ బ్రాహ్మణులు, కృష్ణుడు ఓబీసీ అని అనడం తీవ్ర దుమారం రేపింది. `బ్రాహ్మణులే దేవుళ్లను తయారుచేశారు. రాముడు క్షత్రియుడు. కానీ ఆయనను రుషులే దేవుడిని చేశారు. ఇప్పుడు మనం కృష్ణుడిని ఓబీసీ అంటున్నాం. కానీ ఆ ఓబీసీని దేవుడిని చేసింది బ్రాహ్మణుడైన సందిపాణి రుషి` అని త్రివేది అన్నారు. ఈ కామెంట్లు ర‌చ్చ‌ర‌చ్చ‌గా మారిన‌పప్ప‌టికీ తాజాగా ఆయ‌న మ‌ళ్లీ అదే ఉద‌హ‌రించారు.తన వ్యాఖ్యలను సమర్థించుకోవడానికి త్రివేది భగవద్గీతను ఉదహరించారు. కులం అనేది ఓ వ్యక్తి చేసే పని నుంచి వస్తుంది తప్ప జన్మ నుంచి కాదు. తాను జీవితంలో చేసే పని వల్ల ఓ వ్యక్తి బ్రాహ్మణుడవుతాడు. గీత పరంగా చూస్తే జ్ఞానం ఉన్న వ్యక్తి బ్రాహ్మణుడు అని త్రివేది అన్నారు.  పాలను మరిగించినపుడు పైన ఏర్పడే మీగడే బ్రాహ్మణులు అని ఆయన చెప్పారు. ఎవరైనా బాగా విజ్ఞానం సంపాదించినవాళ్లు బ్రాహ్మణులు` అని త్రివేది స్పష్టంచేశారు. `అందుకే అంబేద్కర్ ఓ బ్రాహ్మణుడని చెప్పడానికి ఏమాత్రం వెనుకాడను. ఆయన ఇంటిపేరు ఓ బ్రాహ్మిన్‌దే. ఆ పేరును ఓ బ్రాహ్మణుడైన ఆయన ఉపాధ్యాయుడే పెట్టారు. అందుకే బాగా విజ్ఞానం సంపాదించిన వ్యక్తిని బ్రాహ్మణుడని పిలవడంలో తప్పులేదు. మోడీ కూడా ఓ బ్రాహ్మణుడని చెప్పడానికి గర్వపడుతున్నాను` అని త్రివేది అన్నారు.కాగా ఈ వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేగిన నేప‌థ్యంలో బీజేపీ నేత‌లు ఎంట్రీ ఇచ్చారు. గుజరాత్ స్పీక‌ర్ కామెంట్స్‌ను అదే పార్టీకి చెందిన ఎంపీ ఉదిత్‌ రాజ్ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ వ్యాఖ్యలు పార్టీకి తీరని నష్టాన్ని చేకూరుస్తున్నాయని ఆయన అన్నారు.
Tags:    

Similar News