గుంతల రోడ్లు, అప్పుల తిప్పలు.. అయినా.. జగన్‌పై జేపీ ప్రశంసలు.. `హేమిటో`!
లోక్‌సత్తా కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే జయప్రకాశ్ నారాయణ్(జేపీ).. చాలా ఆచితూచి మాట్లాడతారనే పేరుంది. ఆయన నిశితం గా గమనిస్తారని.. అంత తేలికగా.. కితాబు ఇవ్వరనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తాయి. ఎందుకంటే.. జేపీ .. మాజీ కలెక్టరు. దీంతో ఆయనకు ఇటు రాజకీయాలు.. అటు అభివృద్ధి, ప్రజల సమస్యలు వంటి పలు అంశాలపైనా.. సమాజంపై ఒక అవగాహన ఉంటుందనే అభిప్రాయం ఉంది. సరే.. ఇది ఎలా ఉన్నా.. ఇప్పుడు జేపీ.. ఏపీ సీఎం జగన్ పై ప్రశంసల జల్లు కురిపించడం.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఏపీలో అద్భుతమైన పాలన జరుగుతోందని ఆయన అన్నారు.
నిజానికి ఏపీలో రోడ్లు బాగాలేవని.. ఎక్కడికక్కడ గుంతలు ఉన్నాయని.. ఆటోవాళ్లు.. సామాన్యులు చందాలు వేసుకుని.. రోడ్లు బాగు చేసుకునే పరిస్తితి ఉందని.. వార్తలు వస్తున్నాయి. ఇక, ప్రతిపక్షాలు ఆధారాలతో సహా చెబుతున్నాయి. అయినా.. జేపీకి అంతా బాగుండడం గమనార్హం. ఇక, శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉన్నా.. ప్రజాగళాన్ని నొక్కేస్తున్నారని.. భావప్రకటన స్వేచ్ఛను హరిస్తున్నారని.. ప్రజాస్వామ్య వాదులు నొక్కి చెబుతున్నారు. ఇటీవల సీపీఎస్‌పై ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఆందోళనకు సిద్ధమైతే.. వారిని పోలీసులు ఎలా కట్టడి చేశారో.. అందరికీ తెలుసునని. కూడా వారు వ్యాఖ్యానించారు.
కానీ..అ దేంటో.. జేపీకి మాత్రం అంతా బాగానే ఉందట. సరే.. ఇక, అప్పుల విషయంలో ఏపీకి ఎవరూ సాటి రారు.. అన్నరీతిలో వ్యవహారం నడుస్తోంది. ఎక్కడ అప్పు దొరికితే అక్కడ అప్పులు తెచ్చేస్తున్నారు. అయినా.. జేపీకి అంతా సూపర్ అనిపించింది.
సరే.. జేపీ ఏమన్నారంటే..
విద్యా, వైద్య రంగంలో ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులను జయప్రకాశ్ నారాయణ అభినందించారు. ఏపీలో విద్యా, వైద్య రంగంలో నాడు-నేడు ద్వారా ఎంతో మేలు జరుగుతుందన్న జేపీ.. ఇది అభినందనీయమని అన్నారు. ఈ విషయంలో సీఎం జగన్ సంకల్పాన్ని అభినందించాలన్నారు. ‘విద్యా, వైద్య రంగంలో ఏపీ ప్రభుత్వం మార్పులను అభినందిస్తున్నా.
విద్యా, వైద్య రంగంలో నాడు-నేడు ద్వారా ఎంతో మేలు జరుగుతుంది. విద్యార్థుల్లో మంచి విద్యా ప్రమాణాలు పెంచాలని ప్రభుత్వం చూస్తోంది. సీఎం జగన్ సంకల్పాన్ని అభినందిస్తున్నా. ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ లేకుంటే పట్టణాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఆరోగ్యశ్రీకి ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తున్న రాష్ట్రం ఏపీ. ఆరోగ్యశ్రీ ద్వారా వైఎస్సార్ దేశానికే ఒక మార్గం చూపారు. ఏపీలో ఫ్రీ డయాగ్నోస్టిక్‌ను బాగా అమలు చేయడం ప్రశంసనీయం’ అని పేర్కొన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.