నిత్యం వార్తల్లో నిలిచే వరంగల్ అర్బన్ కలెక్టర్ అమ్రపాలి పెళ్లి పీటల మీదకు ఎక్కనున్నారు. ఐఏఎస్ లు.. ఐపీఎస్ లు ఎందరో ఉన్నా.. కొందరికి మాత్రం వచ్చే ఇమేజ్ వేరు ఉంటుంది. ట్రైనీగా పని చేసే వేళలోనే.. తరచూ వార్తల్లోకి రావటంతో పాటు.. తన వ్యాఖ్యలతో ఆమె అందరికి సుపరిచితురాలిగా మారారు. మిగిలిన అధికారులకుకాస్త భిన్నమైన పంథాలో నడిచే అమ్రపాలి పెళ్లి ముచ్చట తాజాగా బయటకు వచ్చింది.
తనకన్నా జూనియర్ అయిన ఐపీఎస్ అధికారితో అమ్రపాలి లవ్ మ్యారేజ్ చేసుకోనున్నట్లుగా చెబుతున్నారు. 2010 బ్యాచ్‌కు చెందిన అమ్రపాలి.. 2011 బ్యాచ్‌కు చెందిన సమీర్ శర్మ అనే ఐపీఎస్ అధికారిని ప్రేమ పెళ్లి చేసుకోనున్నారు. విశాఖ జిల్లాకుచెందిన అమ్రపాలి ఉత్తరాదికి చెందిన శర్మతో ప్రేమలో ఉన్నట్లు చెబుతున్నారు. గడిచిన కొంతకాలంగా వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం డయ్యూ (కేంద్రపాలిత ప్రాంతం) ఎస్పీగా వ్యవహరిస్తున్న సమీర్ శర్మతో అమ్రపాలి పెళ్లి వచ్చే నెల 18న జరగనుంది.
2010లోసివిల్స్ రాసిన అమ్రపాలి 39వ ర్యాంక్ తో మీడియాలో ప్రముఖంగా వచ్చారు. మంచి ర్యాంక్‌ను సొంతం చేసుకోవటంతో.. సొంత రాష్ట్ర కేడర్ లో ఐఏఎస్ గా ఎంపికయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాకు ట్రైనీగా కెరీర్ షురూ చేశారు. తర్వాతి కాలంలో తెలంగాణ రాష్ట్ర ఆప్షన్ తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో వికారాబాద్ సబ్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన అమ్రపాలి తర్వాతి కాలంలో మహిళా శిశు సంక్షేమ విభాగానికి మారారు.
కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం వరంగల్ అర్బన్ కు కలెక్టర్ గా ఎంపికయ్యారు. 2016 అక్టోబరులో కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన ఆమె.. పాలనతో తనదైన ముద్ర వేశారు. ఉద్యోగ పరంగా ఆమె చేసిన పనులకు పలు అవార్డులు అందుకున్న ఆమె.. ప్రస్తుతం వరంగల్ రూరల్ జిల్లాకు ఇన్ ఛార్జి కలెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మిగిలిన వారికంటే భిన్నంగా ఉండే అమ్రపాలి.. పెళ్లి విషయంలోనూ అలానే వ్యవహరించిందన్న అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు.