స్కూల్ బ్యాగ్ లో తుపాకీ తీసుకొచ్చి , ఇతర విద్యార్థులను బెదిరించిన 11 ఏళ్ల బాలుడు

Update: 2021-03-04 06:30 GMT
స్కూల్ కి ఎవరైనా కూడా స్కూల్ బ్యాగ్ , బుక్స్ , లంచ్ బాక్స్ తో వెళ్తారు. ఇక అంతకంటే ఎక్కువ ఎవరికీ అవసరం కూడా ఉండదు. మరీ చిన్నపిల్లలు అయితే , స్కూల్ కి కొంచెం స్నాక్స్ తీసుకోని వెళ్లి హాయిగా చదువుకొని , ఫ్రెండ్స్ తో ఆడుకొని ఇంటికి వస్తారు. పిల్లల స్కూల్ బ్యాగ్ లో బుక్స్, పెన్స్, పెన్సిల్స్, బొమ్మలు కూడా పెట్టుకొని కొందరు స్కూల్ కి వెళ్తారు. కానీ , ఓ బుడతడు మాత్రం ఏకంగా స్కూల్ కి గన్ తీసుకోని వెళ్లాడు. స్కూల్ కి తుపాకీ తీసుకోని వెళ్లడమే పెద్ద తప్పు అయితే , ఆ తుపాకీ తో తోటి విద్యార్థులని బెదిరించాడు. అయితే , ఆ తుపాకీ లో బుల్లెట్స్ లేకపోవడంతో పెద్ద గండం తప్పింది. లేకపోతే ఎంతమంది చిన్నారుల ప్రాణాలు గాల్లో కలిసిపోయేవో. విస్తుపోయే ఈ సంచలన ఘటన .. ఫ్లోరిడాలోని నాప్లెస్‌ చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే .. ఫ్లోరిడా లోని నాప్లెస్ ‌లోఉన్న ఓసియోలా ఎలిమెంటరీ స్కూలుకు చెందిన 11 ఏళ్ల బాలుడు తన బ్యాగులో తుపాకీ పెట్టుకొని స్కూల్ కి వెళ్లడం తో  కలకలం రేపింది. కౌంటీ షెరిఫ్‌ అందించిన వివరాల ప్రకారం.. 4వ గ్రేడ్‌ చదువుతున్న బాలుడు తనతో పాటు తుపాకీని స్కూలుకు తీసుకువచ్చాడు. అయితే అందులో బుల్లెట్లు లేవు. ఆ తుపాకీని తోటి విద్యార్థులకు చూపించి బెదిరించినట్లు పాఠశాల అధికారులు గుర్తించారు. అనంతరం వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు బాలున్ని అదుపులోకి తీసుకున్నారు.  అసలు ఆ తుపాకీ ఎవరిదీ , ఆ పిల్లాడి వద్దకు ఎలా వచ్చింది అనే వివరాలని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Tags:    

Similar News