కొడుకు కాలేజీ ఫీజు కోసం ఎలన్ మస్క్ తో దిగిన ఫొటోలు వేలం వేసిన మాజీ ప్రేయసి

Update: 2022-08-24 10:30 GMT
ఎలోన్ మస్క్.. ప్రపంచంలోనే నంబర్ 1 ధనవంతుడు. కానీ ఈ ధనవంతుడి ఎఫైర్లకు లేక్కే లేదు. ఐదారేళ్లకో అమ్మాయిని మార్చి సంసార సుఖాన్ని బాగానే అనుభవించాడన్న పేరుంది. ఇప్పటికే 9 మందికి సంతానం అన్న టాక్ ఉంది. చాలా మందితో ఎఫైర్లు, సహజీవనాలు, పెళ్లిళ్లు చేసుకొని విడిపోయాడు ఈ పెద్ద మనిషి.వారందరికీ కనీసం ఆర్థిక భరోసా కూడా కల్పించలేదన్న ఆరోపణలున్నాయి.

ఈ క్రమంలోనే ఎలోన్ మస్క్ మాజీ ప్రేయసి జెన్నిఫర్ గ్వైన్ తన కొడుకు ట్యూషన్ ఫీజు కోసం డబ్బును సేకరించడానికి 'ఎలన్ మస్క్'నే వాడుకుంది.   1990లో ఎలన్ మస్క్ తో ప్రేమాయణం చేసిన సమయంలో దిగిన ఫోటోలు, బహుమతులు మరియు పుట్టినరోజు కార్డులను వేలం వేయాలని ఆ మాజీ ప్రియురాలు జెన్నిఫర్ నిర్ణయించింది.

మస్క్ - అతని మాజీ ప్రియురాలు పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో కలిసి చదువుకున్నారు. ప్రస్తుతం సౌత్ కరోలినాలో తన   కొడుకుతో  ఈమె నివసిస్తోంది.   తన కొడుకు కాలేజీ ఫీజు కోసం ఎలన్ మస్క్ తో చేసిన సహజీవనం ఫొటోలను వేలం  ద్వారా విక్రయించి సొమ్ము చేసుకోవాలని చూస్తోంది.

జెన్నిఫర్ గ్వైన్  23 ఏళ్ల వయస్సులో ఎలన్ మస్క్ తో దిగిన ఫోటోను పంచుకుంటూ ఇలా రాసుకొచ్చింది. ఎలోన్ సాధారణంగా చాలా రిజర్వ్‌డ్‌గా ఉంటాడు. కానీ అప్పుడప్పుడు అతను చాలా వెర్రివాడిగా ఉంటాడు. నేను అతనితో పాటు నవ్వాలని కోరుకున్నారు. కాబట్టి అతను నిజంగా నవ్వుతూ దిగిన ఈ ఫొటోను షేర్ చేయాలని నిర్ణయించుకున్నాను' అంటూ తమ ఇద్దరి పాత ఫొటోను పంచుకుంది.

1994-95 విద్యాసంవత్సరం సెమిస్టర్  చివరలో ఇద్దరూ ఒకరితో ఒకరు డేటింగ్ చేసుకున్నారు. యూనివర్సిటీ క్వాడ్రాంగిల్ డార్మ్‌లోని 'స్ప్రూస్ స్ట్రీట్' భాగంలో రెసిడెంట్ అడ్వైజర్‌లుగా వీరిద్దరూ గతంలో కలిసి పనిచేశారు.

 ఇక తన మధురమైన టీనేజ్ రొమాన్స్ గురించి కూడా జెన్నిఫర్ పంచుకుంది. అది మధురమైనది, కానీ ఎలన్ మస్క్ ఎక్కువగా ప్రతిఘటించినందున ఎక్కువ ఆప్యాయత అనుబంధం మామధ్య లేకుండా పోయిందని జెన్నిఫర్ తెలిపింది.
Tags:    

Similar News