మోడీ పాలనలో దేశానికి జరిగిన మంచి ఏమైనా ఉందంటే.. స్వదేశీ వస్తువులపై అభిమానం కాస్తంత పెరిగిందనే చెప్పాలి. గతంలో మాదిరి గుడ్డిగా కాకుండా దేశీ.. విదేశీకి సంబంధించిన వస్తువుల ఎంపిక విషయంలో కాస్తంత ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒకవేళ విదేశీ వస్తువునకు సరిపోయే స్వదేశీ వస్తువు ఉంటే.. ఛాయిస్ స్వదేశీ వైపు అడుగులు పడుతున్నాయి. ఇదో కీలక పరిణామంగా చెప్పొచ్చు. ఆ కాన్సెప్టు పుణ్యమా అని దేశీయ కంపెనీల ఇమేజ్ మారిపోవటమే కాదు.. ఇటీవల వారికి క్రేజ్ పెరిగింది. విషయానికి వస్తే.. వాహన రంగంలో అసలుసిసలు దేశీయ కార్ల కంపెనీ అయిన మహీంద్రాకు ఇటీవల కాలంలో పెరిగి ఆదరణ అంతా ఇంతా కాదు.
కాలానికి తగ్గట్లు సరికొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకురావటం ఒక ఎత్తు అయితే.. సంస్థ అధినేత ఆనంద్ మహీంద్రా వ్యక్తిగత ఇమేజ్ కంపెనీకి వరంలా మారింది. అప్పటివరకు మహీంద్రా మీద ఉన్న అభిప్రాయాన్నితన తీరుతో మార్చేలా చేయటంలో ఆయన సక్సెస్ అయ్యారు. ఇటీవల కాలంలో దూకుడు ప్రదర్శిస్తున్న ఆనంద్ మహీంద్రా.. సోషల్ మీడియాలో ఎంత చురుగ్గా ఉంటారన్నది తెలిసిందే. తాజాగా ఆయన కంపెనీ మార్కెట్లోకి తేనున్న విద్యుత్ వాహనాలకు సంబంధించిన ఫోటోల్ని సోషల్ మీడియాలో పంచుకోవటం.. వాటి డిజైన్లు అదిరేలా ఉండటంతో పాటు.. కొంటే మహీంద్రా బ్రాండ్ కార్లు కొనేలా ఉండాలన్నట్లుగా మారాయి.
ఈ డిజైన్లకు పెద్ద ఎత్తున సానుకూల స్పందన లభిస్తోంది. ఇలాంటి వేళ.. తమ ఎలక్ట్రిక్ కార్లకు సంబంధించిన వీడియోను పోస్టు చేసిన ఆనంద్ మహీంద్రాకు ఒక నెటిజన్ చేసిన పోస్టు వైరల్ గా మారింది. ఇంతకీ ఈ పోస్టులో ఏముందన్నదంటే.. ప్రపంచ కుబేరుడు అలెన్ మాస్క్కు చెందిన అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా భారత్ లోకి అడుగుపెట్టాలని ప్రయత్నించటం తెలిసిందే.
అయితే.. ఆ కంపెనీ పరిస్థితులు అనుకూలించటం లేదు. దేశంలో తయారీ పరిశ్రమ పెట్టాలని భారత ప్రభుత్వం కండీషన్ పెడితే.. టెస్లా మాత్రం.. అందుకు భిన్నంగా ముందు దేశంలో అమ్మకాలు చేపట్టిన తర్వాతే.. తయారీ అంశాన్ని ఆలోచిస్తామని చెబుతోంది. దీంతో.. భారత ప్రభుత్వానికి - టెస్లాకు మధ్య పడిన పీటముడి వీడటం లేదు.
ఈ నేపథ్యంలో ఆనంద్ మహీంద్రాను ఆకర్షించిన మీమ్ లో.. ప్రముఖ వెబ్ సిరీస్ మీర్జాపూర్ లోని పంకజ్ త్రిపాఠి క్యారెక్టర్తో రూపొందించారు. 'టెస్లా రాకపోతేం ఏం.. నేనున్నా చూసుకుంటా' అంటూ ఆనంద్ మహీంద్రా భారతీయులకు భరోసా ఇచ్చే అర్థంలో ఈ మీమ్ ను రూపొందించారు.
దీనికి స్పందించిన ఆయన.. నవ్వుతూ ఉండే ఎమోజీ పోస్టు చేశారు. మరో నెటిజన్ కూడా ఇదే తరహాలో స్పందిస్తూ.. 'మాకు టెస్లా అవసరం లేదు. భారత్ లో అంతకు మించిన కార్ల తయారీ కంపెనీలు ఉన్నాయి' అంటూ రాసుకొచ్చారు. మొత్తంగా మహీంద్రా విడుదల చేసిన కొత్త ఎలక్ట్రికల్ కార్ల డిజైన్ దేశ ప్రజల్ని పిచ్చి పిచ్చిగా నచ్చేశాయన్నట్లుగా స్పందన కనిపిస్తోంది.