వైశాల్యం పరంగా పెద్దదిగా ఉన్న అనంతపురం జిల్లాలో రాజకీయాలు కూడా అంతే దూకుడుగా సాగుతుం టాయి. గత ఎన్నికల్లో ఇక్కడ రెండు స్థానాలు (ఉరవ కొండ, హిందూపురం) మినహా మిగిలిన చోట్ల వైసీపీనే విజయం దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ రెండు స్థానాలుకూడా.. తమ ఖాతాలోనే పడాలనే ది వైసీపీ వ్యూహంగా ఉంది.ఈ నేపథ్యంలో నేతలపై ఒత్తిడి బాగానే ఉందని అంటున్నారు పరిశీలకులు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని ప్రతి అసెంబ్లీ స్థానం కూడా వైసీపీ దక్కించుకునేలా .. చేయాలని.. పార్టీ అధిష్టానం నిర్ణయించుకుంది.
ఈ నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితిలో పార్టీ ఎన్ని స్థానాల్లో విజయం దక్కించుకుంటుందనే చర్చ జిల్లా లో జోరుగా సాగుతోంది. ప్రస్తుతం హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలోనేతల మధ్య రగడ కొనసాగు తూనే ఉంది.
పైగా బాలయ్య హవా ఇక్కడ తగ్గదు. సో.. ఇక్కడ టీడీపీదే విజయం అంటున్నారు. ధర్మవ రం నియోజకవర్గంలో పరిటాల శ్రీరాం టీడీపీ తరఫున పోటీ చేస్తే.. ఖచ్చితంగా వైసీపీకి చుక్కలు కనిపిస్తా యని చెబుతున్నారు.
మరీముఖ్యంగా తాడిపత్రిలో వైసీపీ పరాజయం ఖాయమనే అంచనాలు వస్తున్నాయి. పెనుకొండలో ఇప్పటికే మాజీ మంత్రి శంకర నారాయణకు ప్రజల నుంచి సెగలు పొగలు వ్యక్తమవుతున్నాయి.
కదిరి నియోజకవర్గంలో ఈ దఫా వైసీపీ పరాజయంతోపాటు..టీడీపీ నుంచి కందికుంట వెంకట ప్రసాద్ గెలిచే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. మడకశిరలో మాజీ ఎమ్మెల్యే ఈరన్న.. మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి మధ్య టికెట్ పోరు కనిపిస్తోంది.
అయితే.. తిప్పేస్వామి అయితే గెలుపు ఖాయమనే అంచనాలు వస్తున్నాయి. అనంతపురం అర్బన్‌లో ప్రభాకర్ చౌదరి హవా కొనసాగుతోంది. ఇక్కడ పార్టీలోనే ఉన్న చిన్న చిన్న కలహాలను పక్కన పెడితే.. పార్టీ గెలుపు నల్లేరుపై నడకేనని అంటున్నారు పరిశీలకులు. వీటన్నింటికీ మించి.. అభివృద్ధి అజెండాతో పార్టీ ముందుకుసాగితే.. అనంతపురంలో గెలుపు గుర్రం ఎక్కడం ఈజీనేనని చెబుతున్నారు. అయితే.. ఉవరకొండ, అనంతపురం పార్లమెంటు స్థానాల్లో మాత్రం.. వైసీపీ దూకుడు ఎక్కువగా ఉండడం గమనార్హం.