ఇక.. విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గురించి ప్రస్తావించాల్సి వస్తే.. ఆ పార్టీ అధినేత దూకుడుగా విమర్శలు చేయటంలో చూపించే ఉత్సాహం ఏపీ రాజధాని నిర్మాణానికి.. ఏపీ ప్రజల ప్రయోజనాల గురించి పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కనిపించవు. గత కొద్ది రోజులుగా ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై తరచూ మాట్లాడుతున్న ఆయన.. ఇదే అంశాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును నిలదీసే బదులు.. ప్రధాని మోడీని.. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడ్ని ఎందుకు ప్రశ్నించటం లేదు. వారిపై ఎందుకు విరుచుకుపడటం లేదు? అన్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పరు.
ఇక.. ఏపీ ప్రయోజనాలకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఎన్నో వివాదాలు తెరపైకి వచ్చినా.. వాటి విషయంలోనూ స్పందించని ఆయన.. ప్రత్యేక హోదా విషయంలో మాత్రం చెలరేగిపోతున్నారు. ఇన్ని చేస్తున్న ఆయన.. హైదరాబాద్ ను వదిలేసి.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాదిరి ఏపీలో ఎందుకు సెటిల్ కావటం లేదన్నది ఆయనకే తెలియాలి.
అధికారపక్షం రాజధాని నగరాన్ని నిర్మించనున్న నేపథ్యంలో.. ఈ వ్యవహారంలో ఎలాంటి తప్పులు జరగకుండా వ్యవహరించాల్సి ఉంది. తప్పులు జరిగితే ప్రజల దృష్టికి తీసుకురావాల్సి ఉంది. కానీ.. అంత ఓపిక.. తీరికా జగన్ కు ఉన్నట్లు కనిపించదు. రాజకీయ ప్రయోజనం తప్పించి.. మరేమీ ఆయనకు పట్టనట్లుగా కనిపిస్తుంటారన్న విమర్శ ఆయనపై ఉంది.
ఇక.. రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి వస్తే.. తాను ఎట్టి పరిస్థితుల్లో రానని తేల్చి చెప్పటమే కాదు.. శుభలేఖను ఇంటికి వస్తానని చెప్పిన మంత్రులకు కూడా.. కుదరనే కుదరదని తేల్చి చెప్పారు. రాజధాని శంకుస్థాపనకు సంబంధించిన శుభలేఖను ముట్టుకోవటానికి ససేమిరా అనటం జగన్ కు మాత్రమే చెల్లుతుందేమో. ఒక రాష్ట్ర సర్కారులో అధికారపక్ష నేతకు ఎంతటి విలువ ఉంటుందో.. విపక్ష నేతకు అంతే విలువ ఉంటుందన్న విషయాన్ని జగన్ మర్చిపోయినట్లుంది. ఉడుకుమోతు పిల్లాడిగా వ్యవహరించటం తప్పించి.. కాస్తంత హుందాగా వ్యవహరించే తీరు జగన్ లో ఏ కోశాక కనిపించటం లేదన్న భావన కలగటం ఖాయం. చరిత్రలో తన వైఖరి గురించి భవిష్యత్తుతరాలు మాట్లాడుకుంటాయన్న చిన్న విషయాన్ని జగన్ లైట్ గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. తనకు సహజసిద్ధంగా ఉన్నాయని చెప్పే మొండితనంతోనే శంకుస్థాపన విషయంలో తనదైన నిర్ణయాన్ని తీసుకున్నారన్న మాట వినిపిస్తోంది.
ఇక.. ఏపీ అసెంబ్లీలో ఒక్క సీటు అంటే ఒక్క సీటు లేని కాంగ్రెస్ విషయానికి వస్తే.. ప్రజలు ఆ పార్టీని తమ ప్రతినిధులుగా ఏ మాత్రం గుర్తించని వైనం తెలిసిందే. విబజన లాంటి ప్రత్యేక పరిస్థితుల్లో ఇంతటి దారుణ అవమానాన్ని ఏపీ కాంగ్రెస్ ఎదుర్కొంటోంది. ప్రస్తుతం ఆ పార్టీని ఏపీ ప్రజలు సమాధి కట్టిన విషయాన్ని మర్చిపోలేం. కాకుంటే.. ఒకజాతీయ పార్టీగా ఆపార్టీకి సంబంధించిన అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిజానికి ఇప్పటి ఏపీ పరిస్థితికి ప్రత్యక్షంగా.. పరోక్షంగానూ కాంగ్రెస్ దే బాధ్యత. ఈ విషయంలో మరో మాటకు తావు లేదు. తాము అధికారంలో ఉన్నప్పుడు అధినేత సోనియా బర్త్ డే కేక్ కట్ చేసిన చందంగా ఏపీని రెండు ముక్కలు చేసిన సమయంలో నోరు విప్పి మాట్లాడింది ఎంతన్నది అందరికి తెలిసిన విషయమే. విభజన సమయంలో అధినేత్రికి సమాధానం చెప్పలేక.. ఆమెను నిలదీసే సాహసం చేయలేక దద్దమ్మాల్లా చరిత్రలో నిలిచిపోయారు
విభజన తర్వాత అయినా ఏపీ ప్రజలకు న్యాయం జరిగేలా వ్యవహరించటంలో అధినేత్రితోపాటు.. యువరాజు కూడా పెద్దగా చేసిందేమీ లేదు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంపై సోనియమ్మ కానీ.. రాహుల్ కానీ గొంతు పెంచి మాట్లాడింది లేదు. రాజధాని నిర్మాణం గురించి వారి నోటి నుంచి ఒక్క మాట వచ్చింది లేదు.ఏపీ రాజధానికి కేంద్రం ఏ విధంగా సాయం చేస్తుందన్న విషయంపై కూడా కాంగ్రెస్ పార్టీ ఏ దశలోనూ నిలదీసింది లేదు.
ఇక.. బీజేపీ కావొచ్చు.. సీపీఎం.. సీపీఐ పార్టీలన్నీ కూడా తమకు తగిన రాజకీయాల్ని చేస్తుందో తప్పించి.. ఏపీ ప్రజలకు ప్రయోజనం కలిగించే పనిని మాత్రం చేయటం లేదు. ప్రత్యేక హోదా గురించి వామపక్షాలు ఇప్పుడు మాట్లాడుతున్నాయి తప్పించి.. విభజన సమయంలో నోరు మూసుకొనే ఉన్నాయి. ప్రత్యేక హోదాతోపాటు ఏపీ రాజధానికి సంబంధించిన అంశంపై ఈ పార్టీలేవీ బాధ్యతా వ్యవహరించటం లేదన్న విమర్శ వినిపిస్తోంది. విపక్షంలో ఉన్న వామ పక్షాల పరిమితుల్ని పరిగణలోకి తీసుకొని వదిలేస్తే.. అధికారంలో భాగస్వామిగా ఉన్న బీజేపీ మాటేమిటి? ఏపీలో కుదురుకోవాలని.. భవిష్యత్తులో సీమాంధ్రలో బలం పెంచుకోవాలని భావిస్తున్న కమలనాథులు.. ఏపీ రాజధాని కోసం కేంద్రం నుంచి ప్యాకేజీల దగ్గర నుంచి.. వరాలు తీసుకొస్తున్నది తక్కవే. ఇలా ఏ పార్టీకి ఆ పార్టీ తమ తమ పరిధుల్లో ఉన్నాయే తప్పించి.. ప్రజల్లో ఉన్నట్లుగా అమరావతి మనదన్న భావనం కనిపించటం లేదనే చెప్పాలి. ఎవరికి వారు.. వారి వారి రాజకీయ స్వార్థం కోసం మాట్లాడుతున్నారే తప్పించి.. హుందాగా.. చరిత్రలో నిలిచిపోయేలా ఎవరూ వ్యవహరించకపోవటం అన్నింటికి మించిన దురదృష్టకరంగా చెప్పక తప్పదు.