నెల్లూరు సిటీ వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వివాదాలను వీడటం లేదు. తాజాగా ఆయన మరో వివాదంలో చిక్కుకున్నారు. పార్కింగ్ విషయంలో అనిల్ అనుచరులు ఒక అపార్టుమెంట్ పార్కింగ్ సిబ్బందిని చితకబాదడం కలకలం రేపుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో అపర్ణ సెరెన్ అపార్టుమెంట్ లో అనిల్ కుమార్ యాదవ్ కు ఒక ఫ్లాట్ ఉంది. తాజాగా ఆయన తన అనుచరులతో కలిసి అక్కడికి వచ్చారు. ఈ క్రమంలో కార్లు పార్కింగ్ విషయంలో అక్కడి సెక్యూరిటీ సిబ్బందితో అనిల్ అనుచరులకు గొడవ జరిగింది. దీంతో సెక్యూరిటీ సిబ్బందిని అనిల్ అనుచరులు చితకబాదారని చెబుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కార్లు పార్కింగ్ చేయొద్దని చెప్పడంతో అనిల్ అనుచరులు రెచ్చిపోయారని అంటున్నారు.
సెక్యూరిటీ సిబ్బందిపై అనిల్ అనుచరుల దాడిని అపార్ట్ మెంట్ వాసులు వీడియో తీశారు. దీన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్ అవుతోంది.
ఇప్పటికే అనిల్ వివాదాల్లో ఉన్నారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో తన బాబాయి, నెల్లూరు డిప్యూటీ మేయర్ అయిన రూప్ కుమార్ యాదవ్ తో ఆయనకు తీవ్ర విభేదాలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై ఇప్పటికే వైసీపీ పెద్దలు ఇరువురి మధ్య రాజీకి ప్రయత్నించినా అనిల్ ససేమిరా అన్నారని టాక్. దీంతో ఈ పంచాయతీ ఏకంగా వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ వద్దకే చేరింది.
జగన్.. అనిల్, రూప్ కుమార్ యాదవ్ లతో మాట్లాడి సయోధ్య కుదిర్చారు. ఒకరి చేతిలో ఒకరు చేయి కలిపారు. అయితే సీఎం దగ్గర నుంచి బయటకొచ్చిన కొద్ది రోజులకే తన బాబాయితో తాను కలిసేది లేదని అనిల్ కుండబద్దలు కొట్టారు. టికెట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా తనకు ఫర్లేదని.. రూప్ కుమార్ తో కలిసి పనిచేసేది లేదని స్పష్టం చేశారు.
నెల్లూరు సిటీలో రాజీ చేశాక కూడా మళ్లీ విభేదాలు నెలకొనడంతో రెండు రోజుల క్రితం అనిల్ ను జగన్ మరోమారు పిలిపించారు. నియోజకవర్గంలో పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రశాంతంగా పనిచేసుకోవాలని సూచించారు. ఇంతలోనే అనిల్, ఆయన అనుచరులు మరో వివాదంలో చిక్కుకోవడం ఆయనకు ఇబ్బందిగా మారింది.