నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వాడే వాటిల్లో గూగుల్ ఒకటి. ఎప్పుడైనా ఏదైనా తెలీకుంటే.. మరో ఆలోచన లేకుండా ఆశ్రయించేది గూగులమ్మనే. అంతటి పవర్ ఫుల్ గూగుల్ ను పనికిమాలిన విషయాల గురించి శోధించే ప్రయత్నం చేస్తే అడ్డంగా బుక్ కావటమే కాదు.. ఇట్టే జైలుకు వెళ్లటం ఖాయమన్న హెచ్చరిక చేస్తున్నారు.
డిజిటల్ యుగంలో ఏ చిన్న సందేహం వచ్చినా.. మరో ఆలోచన లేకుండా వెతికే గూగుల్.. ఎంతలా సాయం చేస్తుందో.. సరదా కోసం కావొచ్చు.. మరింతగా వివరాలు తెలుసుకోవాలన్న ఉద్దేశంతో కావొచ్చు.. అస్సలు టచ్ చేయకూడని మూడు అంశాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఆ మూడింటి జోలికి మాత్రం అస్సలు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు. పొరపాటున వెళ్లినా.. కటకటాల వెనుకకు వెళ్లటం ఖాయని వార్నింగ్ ఇస్తున్నారు. ఇంతకీ ఆ మూడు పదాలేమంటే..
1. చైల్డ్ పోర్నోగ్రఫీ
2. బాంబుల తయారీ
3. అబార్షన్
గూగుల్ ను వెతికే క్రమంలో చాలామంది అవగాహన లేకుండా వెతికే వారుంటారు. అలాంటి వారికి ఈ మూడు పదాల్ని సెర్చ్ చేస్తే మాత్రం తిప్పలు తప్పవంటున్నారు. పొరపాటున సెర్చ్ లో వీటి గురించి వెతికిన వెంటనే.. పోక్సో చట్టం కింద జైలు ఖాయమైనా కావొచ్చు. అదే జరిగితే.. చైల్డ్ పోర్నోగ్రఫీ నేరం కింద ఐదేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు పడే అవకాశం ఉంది. సరదా కోసం కూడా వెతకూడని పదాల్లో ముఖ్యమైనది చైల్డ్ పోర్నోగ్రఫీ. మరో ప్రమాదకరమైన పదం.. బాంబుల తయారీ.
గూగుల్ లో బాంబుల్ని ఎలా తయారు చేస్తారు? అన్న ప్రశ్నను సంధించిన వెంటనే.. మీ సిస్టం.. జియో సింక్రనైజేషన్ ద్వారా మీరున్న లొకేషన్ వివరాలు ఇట్టే తెలిసిపోతాయి. బాంబుల తయారీ మీద వెతుకుతున్నట్లుగా సమాచారం అందిన వెంటనే పోలీసులు స్పందించి జైలుపాలు చేయటం ఖాయమంటున్నారు. ఇక.. గూగుల్ లో వెతక్కూడని మూడో ముఖ్యమైన పదం అబార్షన్. గర్భ స్రావాల్ని నిరోధించేందుకు భారత్ బలమైన చట్టాల్ని రూపొందించింది.
అందుకే.. అబార్షన్ కు సంబంధించిన కంటెంట్ వెతికినంతనే కేసుల చిక్కుముడుల్లోకి చిక్కుకుపోవటం ఖాయం. మిగిలిన అంశాలు ఎలా ఉన్నా.. ఈ ప్రమాదకరమైన మూడు పదాల్ని మాత్రం గూగుల్ లో వెతికే ప్రయత్నం మాత్రం అస్సలు చేయద్దని చెబుతున్నారు. బీకేర్ ఫుల్.