ఏపీ బీపీ : పింఛ‌ను పంపిణీలో నిజాలెన్ని ? ఎందాక !

Update: 2022-04-19 05:30 GMT
బ్యాంకు సెల‌వుల‌ను కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోకుండా పింఛ‌న్ల పంప‌కంపై విషం చిమ్మ‌డం కొన్ని మీడియా సంస్థ‌ల‌కు త‌గ‌ద‌ని యువ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆవేద‌న చెందుతున్నారు. అదే స‌మ‌యంలో గ‌తంలో పంచిన పింఛ‌ను మొత్తాలు ఇప్పుడు తాము అమ‌లు చేస్తూ వ‌స్తున్న పింఛ‌ను ప్ర‌క్రియ సంబంధించిన నిర్ణ‌యాలు ఓ సారి పోల్చి చూడాల‌ని కూడా ప్ర‌జ‌ల‌కు విన్న‌విస్తున్నారాయ‌న.

క‌నుక అవాస్త‌విక దృక్ప‌థంతో ప‌నిచేయ‌డం మానుకోవాల‌ని సూచ‌న చేస్తున్నారాయ‌న. విషం చిమ్మేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నాలు విర‌మించుకోవాల‌ని హిత‌వు చెబుతున్నారు. ఆ విధంగా ఆయ‌న త‌న వ‌ర‌కూ ఏం చేశానో ఏం చేయ‌గ‌ల‌నో చెబుతూ.. ఇవాళ ప్ర‌ధాన మీడియాలో ఓ ప్ర‌క‌ట‌న జారీ చేశారు. ఆ వివ‌రం ఈ క‌థ‌నంలో...

ఇవాళ ఆంధ్రాలో పింఛ‌ను పంపిణీకి సంబంధించి కొంత ప్ర‌తిష్టంభ‌న నెల‌కొంది అని తెలుగు దేశం పార్టీ అంటోంది. ఆ విధంగానే అనుకూల మీడియా కూడా క‌థ‌నాలు వండి వారుస్తోంద‌ని వైసీపీ మండిప‌డుతోంది.ఈ నేప‌థ్యంలో ఆంధ్రా స‌ర్కారు ఇవాళ ఒక ప్ర‌క‌ట‌నను విడుద‌ల చేసింది.

(పెయిడ్ స్పేస్ లో రెండ‌క్ష‌రాల మీడియాలో ప్రచురితం అయిన ప్ర‌క‌ట‌న‌).. దీని ప్ర‌కారం చూసుకుంటే పింఛ‌ను పంపిణీలో త‌మ ప్ర‌భుత్వం పార‌ద‌ర్శ‌కంగానే ఉంద‌ని ఇచ్చిన మాట ప్ర‌కారం విడ‌త‌ల వారీగా సంబంధిత వ‌ర్గాల‌కు అందిస్తున్న ఆర్థిక ప్ర‌యోజ‌నం పెంచుకుంటూ వెళ్తున్నామ‌ని అంటోంది. ఆ విధంగా ఇప్పుడు అవ్వాతాత‌ల‌కు తాము చెప్పిన ప్ర‌కారం రెండు వేల ఐదు వంద‌ల రూపాయ‌లు నెల‌కు అందిస్తున్నామ‌ని అంటోంది.

ఆ విధంగా చూసుకుంటే ఆ రోజు క‌న్నా ఈ రోజు పింఛ‌న్ల‌కే తాము నెల‌కు 15 వంద‌ల 64 కోట్ల రూపాయ‌ల‌ను  61 ల‌క్ష‌ల మంది ల‌బ్ధిదారుల‌కు పంచుతున్నామ‌ని ఇందులో వాస్త‌వ దూరం ఏమీ లేద‌ని  చెబుతోంది. కానీ కొన్ని మీడియాల‌లో త‌ప్పుడు క‌థ‌నాలు వ‌స్తున్నాయ‌ని వివ‌ర‌ణ ఇస్తూ కొన్ని ఆధారాలు అందించేందుకు ప్ర‌య‌త్నిస్తోంది ఆంధ్రా స‌ర్కారు.

ఆ లెక్క‌న చూసుకుంటే ఇప్పుడు తాము అందిస్తున్న పింఛ‌ను మొత్తం ఆ రోజు టీడీపీ అందించిన మొత్తానికి ఎన్నో రెట్లు అధికం అని ఆ రోజు టీడీపీ స‌ర్కారు పంచిన మొత్తం విలువ 461 కోట్ల రూపాయ‌లు మాత్ర‌మే అని, మొత్తం లబ్ధిదారులు 43 ల‌క్ష‌ల మంది అయితే, అందులో 80 శాతం మందికి మాత్ర‌మే పింఛ‌ను వ‌చ్చింద‌ని ఆ లెక్క‌న చూసుకుంటే తాము అందించిన వివ‌రాలు క్షేత్ర స్థాయిలో ఉన్న నిజాలు ఇవ‌న్నీ కూడా స‌త్య దూరం కావ‌ని అంటోంది వైసీపీ స‌ర్కారు.
Tags:    

Similar News