అధికారంలో ఉంటే డాబు దర్పం.. అబ్బొ చెప్పలేనంత ఉంటుంది.. అత్యున్నత పదవీలో ఉంటే ఎక్కడి వెళ్ళినా ఆడంబరంగా వెళ్ళవచ్చు.. ఏ వాహనంలోనైనా పోవచ్చు.. అంతేకాదు తాను ఆడింది ఆట.. పాడింది పాటగా ఉంటుంది.. కానీ ఎందుకో ఏపీ సీఎం జగన్ ఆడంబరాలకు దూరంగా ఉంటారు. ఎప్పుడు చూసినా సింప్లిసిటికి ప్రాధాన్యత ఇస్తారు. మోములో అదే చెదరని చిరునవ్వు.. ఒకటే రకమైన దుస్తులు.. ఆహార్యంలో సేమ్ టూ సేమ్.. అధికారంలో లేనప్పుడు ఎలా ఉన్నాడో.. ఇప్పుడు అధికారం వచ్చినాకా అలేగే ఉన్నాడు. అయితే అధికారంలోకి వచ్చాక.. సీఎంగా ప్రమాణస్వీకారం చేసినా కూడా తన పద్దతులు ఏమాత్రం మార్చలేదు.. సరికదా ఇంకా పొదుపు చర్యలకు శ్రీకారం చుట్టారు..
ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న ఆర్భాటాలను, హంగామా, దుబారా ఖర్చులను చూసి ఈసడించుకున్నారు. అంతేకాదు.. ఇలా దుబారా ఖర్చులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీయేద్దని సలహా ఇచ్చారు. సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారానికే దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు చేశారంటే ఇక ఐదేళ్ల పాలనలో ఎంత దుబారా ఖర్చు చేశారో చూసిన సీఎం జగన్ గత పాలకులకు భిన్నంగా ఖర్చులు తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నారు. తన ప్రమాణస్వీకారం రోజునే దుబారాకు ప్రాధాన్యత ఇవ్వమని గట్టి సంకేతాలు ఇచ్చారు సీఎం జగన్.
ఇక అప్పటి నుంచి దుబారా ఖర్చులు, హంగులు, ఆర్భాటాలకు తావు లేకుండా జాగ్రత్త పడుతూ, టూర్ల పేరుతో కూడా అధిక ఖర్చు లేకుండా చూసుకుంటున్నారు. అయితే ఓవైపు సీఎం జగన్ దుబారాకు దూరంగా ఉండి రాష్ట్ర ఖజాన దుబారా కాకుండా చూస్తుంటే.. మరోవైపు సీఎంకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ కూడా తోడయ్యారు. కేంద్ర ప్రభుత్వం జగన్ ఆలోచనను అర్థం చేసుకుందో.. లేక గవర్నర్ సీఎం జగన్ ఆలోచనను పసిగట్టాడో ఏమో తెలియదు కానీ సీఎం జగన్ ఆలోచనకు అనుగుణంగా దుబారా చేయడంలోనూ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.
రాష్ట్ర గవర్నర్‌గా తనకున్న వసతులను ఎంచక్కా ఉపయోగించుకునే అవకాశం ఉన్నా కూడా గవర్నర్ రాష్ట్ర ఖజానాకు భారం కాకుడదనే ఆలోచనతో దుబారాకు చెక్ పెట్టారు. అందుకు సీఎం జగన్ ఆలోచనకు అనుగుణంగా గవర్నర్ ముందుకు సాగుతున్నారు. గురువారం గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ తిరుపతి ఉత్సవాలకు వెళ్ళారు. అయితే తనకున్న అవకాశం మేరకు ప్రత్యేక విమానంలో తిరుపతి వెళ్ళి రావచ్చు.. కానీ ప్రత్యేక విమానంలో అయితే అధికంగా ఖర్చు అవుతుందని భావించిన గవర్నర్ నాకు ప్రత్యేక విమానం వద్దు.. సాధారణ ప్రయాణికులు ప్రయాణించే విమానంలోనే వెళ్ళారు.
విజయవాడ నుంచి హైదరాబాద్‌కు సాధారణ ప్రయాణికుల విమానంలో వచ్చి.. అక్కడి నుంచి తిరుపతికి మరో విమానంలో వెళ్ళారు.. అక్కడ కూడా ఎక్కువ సమయం గడిపితే భక్తులకు ఇబ్బందులు కలుగుతాయని కేవలం గంట మాత్రమే గడిపి దైవదర్శనం చేసుకుని వెంటనే తిరుపతి నుంచి హైదరాబాద్, అక్కడి నుంచి విజయవాడకు చేరుకున్నారు. అంటే అందరు ప్రయాణికులు మాదిరిగానే సాధారణ ప్రయాణికుడి మాదిరిగానే హంగు ఆర్భాటాలకు తావు లేకుండా రాష్ట్ర వ్యయం దుబారా కాకుండా పొదుపులో జగన్‌కు పోటీగా గవర్నర్ తయారు కావడం పట్ల ఇద్దరు ఇద్దరే అని అనుకుంటున్నారు ఏపీ జనాలు..