ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెలోకి వెళ్ళిపోయారు. తమ డిమాండ్లకు ప్రభుత్వం ఆమోదించేవరకూ ఆందోళన బాట వీడమని వారు కచ్చితంగా చెప్పేస్తున్నారు. ఈ నేపధ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వం తమకు ఇచ్చిన కొన్ని వరాల మీద కూడా మండిపడుతున్నారు. మేము ఫిట్మెంట్ పెంచాలని కోరాం, మంచి పీయార్సీ ఇవ్వాలని కూడా కోరాం, అలాగే హెచ్ ఆర్ ఏ వంటివి యధాతధంగా ఉంచాలని డిమాండ్ చేస్తున్నాము, మారి ఆర్ధికపరమైన అన్ని అంశాల్లో భరోసా ఇవ్వాలన్నది మా కోరిక అని క్లారిటీగా చెబుతున్నారు.
అదే టైమ్ లో రిటరిమెంట్ వయసుని మరో రెండేళ్ళు పెంచామని చెబుతున్నారని, అది మేము కోరామా అని వారు నిలదీయడమే విశేషం. రెండేళ్ల పాటు హాయిగా మరిన్ని లక్షల జీతాలని, నాలుగు డీఏలను, రెండు ఇంక్రిమెంట్లను పొందే వీలు ఉందని ప్రభుత్వం లెక్కలేసి మరీ చెబుతోంది. అయితే మేము కోరనిది ఇచ్చి ఇపుడు కోరినవి పక్కన పెడితే మాకు ఈ రోజుకు ఏమి లాభమని వారు అంటున్నారు.
పైగా రిటైర్మెంట్ వయసు పెంచినా చేసేందుకు సిద్ధంగా లేమని చాలా మంది ఉద్యోగులు అనడం విశేషం. ప్రస్తుతం అన్ని రకాలుగా వత్తిడి ఉందని, ఇలాంటి వత్తిడితో ఎపుడు రిటైర్ అవుదామా అనే ఎక్కువ శాతం ఉద్యోగులు చూస్తున్నారు అని అంటున్నారు. అలాంటిది మరో రెండేళ్ళు పెంచేసి చేయమంటే మేం చేయవద్దా అని వారు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మేము అడిగిన వాటిని తీర్చకుండా ఇలా వరాలు ఇచ్చామని చెప్పడం వల్ల ఉపయోగం లేదని కూడా తేల్చేస్తున్నారు.
ఏతా వాతా తేలేది ఏంటి అంటే రిటైర్మెంట్ వయసు పెంచామని, దేశంలో ఎక్కడా లేని విధంగా 62 ఏళ్ల వరకూ ప్రభుత్వ ఉద్యోగం చేసుకునే వీలు కల్పించామని ప్రభుత్వం అంటోంది. అయితే అది మాకు సమ్మతం కాదు అనే అంటున్నారు. ఇంకో వైపు ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళనకు నిరుద్యోగ సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి. ప్రభుత్వం రిటైర్మెంట్ ఏజ్ ని యధా ప్రకారం ఉంచాలని, ఖాళీలు అయ్యే చోట నిరుద్యోగ యువతకు అవకాశం ఇవ్వాలని వారు కోరుతున్నారు.
మొత్తానికి చూస్తే రిటైర్మెంట్ ఏజ్ పెంచడం ద్వారా భారీ గా ప్లస్ అవుతుందని భావిస్తున్న ప్రభుత్వానికి మెజారిటీ ఉద్యోగులు రివర్స్ లో దాన్ని తిప్పికొడుతూండడంతో ఏం చేయాలో పాలుపోవడంలేదు అనే అంటున్నారు. మరి ఉద్యోగులను మెప్పించని ఈ రిటైర్మెంట్ ఏజ్ పెంపుని సర్కార్ వెనక్కి తీసుకుంటుందా. చూడాలి.