ఎన్ని కష్టాలకోర్చుకునైనా.. తల్లి తనబిడ్డలను కడుపులో పెట్టుకుని కాచుకుంటుంది. అనేక త్యాగాలు కూడా చేస్తుంది. అందుకే ఈ ప్రపంచంలో తల్లిని మించిన దైవం లేదని అంటారు. కానీ, అదేం ఖర్మో తెలియదు కానీ.. ఇటీవల కాలంలో ఒకరిద్దరు తల్లులు చేస్తున్న ఘోరాలతో అమ్మ పదానికి అపవాదు వస్తోంది.
తాజా ఘటనలో ప్రియుడితో సెక్స్ కోసం.. తన 4 ఏళ్ల కొడుకును ప్రియుడితో కలిసి కర్కశంగా చంపేసింది.. ఓ తల్లి! ఏపీలో జరిగిన ఈ ఘోరం కొంత ఆలస్యంగా వెలుగు చూసింది.
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గానికి చెందిన మారుతి నాయక్ లారీ డ్రైవర్. ఇతనికి 14 ఏళ్ల క్రితం బెంగళూరుకు చెందిన యువతితో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు బిందు (4) ఉన్నారు. చాలాకాలం కడప జిల్లా ప్రొద్దుటూరులో నివాసం ఉన్న వీరు ఖాజీపేటకు మకాం మార్చారు. మారుతి నాయక్ కు పనిలో భాగంగా వినోద్ అనే మరో డ్రైవర్‌తో పరిచయమైంది.
వినోద్ తరచూ వీరి ఇంటికి వచ్చిపోయేవాడు. ఈ క్రమంలో మారుతి భార్యకు, వినోద్‌కు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో మూడు నెలల క్రితం కొడుకును, ఎనిమిదేళ్ల కూతురిని తీసుకుని వినోద్‌తో వెళ్లిపోయింది. అప్పటి నుంచి వీరు బద్వేలు పట్టణంలో సహజీవనం చేస్తున్నారు.
అయితే... ఒక రోజూ రాత్రిపూట మారుతి భార్య, వినోద్‌లు సెక్స్‌లో నిమగ్నమై ఉన్న సమయంలో ఆమె కుమారుడు బిందు 'నాన్న నాన్న' అని బిగ్గరగా ఏడవడం ప్రారంభించాడు. దీంతో తమ గుట్టు ఇరుగు పొరుగు వారికి తెస్తుందని భావించిన ఇద్దరూ గొంతు నులిమి హత్యచేశారు. అంతేకాదు.. సదరు బాలుడి శవాన్ని అదే ఇంట్లో పాతి పెట్టారు.
అయితే..ఈ విషయం ఎలా బయట పడిందంటే.. తనను వదిలేసి వెళ్లిపోయిన భార్యను వెతుక్కుంటూ.. మారుతి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి.. విషయాన్ని కూపీ లాగారు. ఆ మృతదేహాన్ని తహశీల్దారు మల్లికార్జునరెడ్డి, డీఎస్సీ వంశీధర్ గౌడ్ ఆధ్వర్యంలో వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.