ఏపీ పేడ పలావు తినేందుకు కేసీఆర్ రెఢీ అయ్యారా?

Update: 2022-10-10 04:53 GMT
నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేయటం.. వెనుకా ముందు చూసుకోకుండా అనేసే అధినేతలు.. నేతలు మాటలు చేసే గాయాలు అన్ని ఇన్ని కావు. తెలంగాణ ఉద్యమం వేళలో ఏపీని.. ఏపీ ప్రాంతానికి చెందిన వారిని ఉద్దేశించి పలు సందర్భాల్లో వాడిగా వేడిగా మాటలు అనేసే తీరు గులాబీ బాస్ కేసీఆర్ లో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తూ ఉంటుంది.

తనకు నచ్చని వారి గురించి ఎంత దారుణంగా మాట్లాడతారో తెలియంది కాదు. తెలంగాణ ఉద్యమ వేళలో ఏపీ ప్రజల మీద అనవసరమైన ఆగ్రహాన్ని ప్రదర్శిస్తూ.. అక్కడి వారి తిండిని తప్పు పట్టటమే కాదు.. దారుణంగా అవమానించిన వైనం తెలిసిందే.

అప్పట్లో ఉన్న పరిస్థితుల్లో కామ్ గా ఉండటమే తప్పించి తిరిగి సమాధానం చెప్పలేని పరిస్థితి ఏపీ ప్రాంతానికి చెందిన నేతలతో పాటు.. ప్రజలు కూడా. ఒకవేళ.. ఎవరైనా ఏదైనా మాట అంటే.. దానికి తగ్గట్లుగా మీడియాలోనూ ప్లేస్ రాని పరిస్థితి. అందుకే.. అప్పట్లో తమను ఉద్దేశించి కేసీఆర్ అన్న మాటల్ని తాజాగా బయటకు తీస్తున్నారు పలువురు. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చేసిన నేపథ్యంలో.. కొత్త వాదనలు మొదలయ్యాయి.

ఏపీలోనూ పాగా వేయాలన్న తపన పడుతున్న కేసీఆర్ కు ఇటీవల కాలంలో పంచ్ ల మీద పంచ్ లు పడుతున్నాయి. తెలంగాణ ఉద్యమ వేళలో.. ఏపీని.. అక్కడి ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడిన కేసీఆర్.. ఏపీ వారి పలావు పేడ మాదిరి ఉంటుందంటూ దారుణ వ్యాఖ్యలు చేశారు.

అంతేకాదు.. లంకలో పుట్టినోళ్లంతా రాక్షసులే అన్న మాటను ఆయన నోటి నుంచి వచ్చింది. అప్పట్లో తెలంగాణ సెంటిమెంట్ తీవ్రంగా ఉన్న వేళలో.. ఆ మాటలకు కోట్లాది మంది హర్ట్ అయిన పరిస్థితి.

ఇంతకాలం వెయిట్ చేసిన వారు.. కేసీఆర్ జాతీయ పార్టీ నేపథ్యంలో.. ఏపీలో ఓట్లు.. సీట్లు కావాలంటే మొదట పేడలా ఉండే ఏపీ పలావును కేసీఆర్ తినాల్సిందే అన్న మాట సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది. మరి.. ఏపీ ప్రజల ఓట్లు.. వారి కారణంగా వచ్చే సీట్ల కోసం తపిస్తున్న కేసీఆర్.. తాను గతంలో అన్న మాటలు తప్పు అనేలా స్పష్టం చేసిన తర్వాతే ఏపీ మీద ఆశలు పెట్టుకోవాలన్న మాట వినిపిస్తోంది. మరి.. కేసీఆర్ ఎలా రియాక్టు అవుతారో చూడాలి.




దాదాపు అల్లు అర్జున్ ఫైనల్ కథను వినిపించినట్లుగా తెలుస్తోంది. బన్నీకే కథ నచ్చడంతో తప్పకుండా పాన్ ఇండియా రేంజ్ లోనే సినిమా చేయాలి అని ఆలోచనతో ఉన్నాడట.
Tags:    

Similar News