అమెరికాలోని ఫ్లోరిడాలో కొత్తగా తెరిచిన బీచ్‌ను ఓ భయంకర ఆకారం వెంటాడుతోంది. రాష్ట్రంలో అనేక వ్యాపారాలు.. బీచ్ లను తెరుస్తున్నందున కరోనా మళ్లీ ప్రబలడం మొదలైంది. దీనికి నిరసనగా ఫ్లోరిడా న్యాయవాది డేనియల్ ఉహ్ఫెల్డర్ మాట్లాడుతూ మహమ్మారి విస్తరిస్తున్న ఈ సమయంలో ఇలా చేయడం చాలా పెద్ద తప్పు అని.. ఇది సమాజానికి పెద్ద ముప్పుగా మారుతుందన్నారు. లాక్ డౌన్ సడలించడం తిరిగి తెరవడం ప్రమాదమని ఇతడు భావిస్తున్నాడు. ప్రభుత్వ నిర్ణయంపై నిరసన తెలపాలని నిర్ణయించుకున్నాడు. కాని అతను ఎంచుకున్న నిరసన విధానం భయంకరమైనది.
అపరచితుడులో పాపులను శిక్షించే నరకరూప రాక్షసుడి గెటప్ ధరించిన డేనియల్ గ్రిమ్ రీపర్ నల్లని వస్త్రంతో కప్పుకొని పొడవైన కొడవలిని పట్టుకుని, బీచ్ వద్ద భయంకరంగా నిలబడ్డాడు. ఇంట్లో ఉండాలన్నది అతడు విజ్ఞప్తి చేస్తున్నాడు. కానీ ప్రజలు పట్టించుకోకపోవడంతో ఇలా వారిని భయపెట్టి ఇలా దర్శనమిస్తున్నాడు. డేనియల్ ఫ్లోరిడాలోని వాల్టన్ కంట్రీ చుట్టూ ఉన్న బీచ్‌లలో పర్యటిస్తున్నాడు. చాలా రద్దీగా ఉన్న చోట చేరి ప్రజలను భయపెడుతున్నాడు. కరోనా విస్తరిస్తున్న ఈ సమయంలో తిరిగి ప్రమాదకరమైనది అతను భావిస్తున్నాడు.
ఫ్లోరిడా రాష్ట్రంలో 1314 మరణాలు ఇప్పటివరకు సంభవించాయి. 35000 కి పైగా కేసులు నమోదయ్యాయి. అమెరికాలో ఇప్పటివరకు 65,500 మందికి పైగా మరణించారు. 1,102,700 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి.. అయినప్పటికీ, అమెరికాలోని 32 రాష్ట్రాలు సోమవారం నుండి లాక్ డౌన్ ను తిరిగి తెరుస్తామని ప్రకటించాయి.. బహిరంగ ప్రదేశాల్లో ముసుగులు ఉపయోగించాలనే సూచనలతో పాటు సామాజిక దూర మార్గదర్శకాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్దేశించింది. దేశాన్ని తిరిగి తెరవడంపై మిశ్రమ అభిప్రాయాలు ఉన్నాయి.
వైరస్ వ్యాప్తి మరియు మరణాలు గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ సమయంలో, వ్యాపారాలు తెరవడం మరింత అల్లకల్లోలం కలిగించవచ్చు, ఇది ప్రభుత్వాలకు తిరిగి పశ్చాత్తాపం కలిగించే నిర్ణయంగా మారనుంది.